Waltair Veerayya: బాక్సాఫీస్‌పై వాల్తేరు వీరయ్య దండయాత్ర.. మూడు రోజుల్లోనే వందకోట్ల క్లబ్‌లోకి మెగాస్టార్‌ సినిమా

సంక్రాంతి కానుకగా శుక్రవారం (జనవరి 13)న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన వాల్తేరు వీరయ్య మూడురోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించించారు మైత్రీ మూవీ మేకర్స్.

Waltair Veerayya: బాక్సాఫీస్‌పై వాల్తేరు వీరయ్య దండయాత్ర.. మూడు రోజుల్లోనే వందకోట్ల క్లబ్‌లోకి మెగాస్టార్‌ సినిమా
Waltair Veerayya
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Jan 19, 2023 | 8:12 AM

వాల్తేరు వీరయ్య సినిమాతో చాలా రోజుల తర్వాత సంక్రాంతి పండగ బరిలోకి దిగారు మెగాస్టార్‌ చిరంజీవి. పోటీగా పెద్ద హీరోల సినిమాలు ఉన్నా చకా చకా షూటింగ్‌ పూర్తి చేసి మరీ పొంగల్‌కు థియేటర్లోకి అడుగుపెట్టారు. అనుకున్నట్లే ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. వింటేజ్‌ చిరంజీవిని చూసేందుకు అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. సంక్రాంతి కళ తగ్గిపోతున్నా వాల్తేరు వీరయ్య థియేటర్లు మాత్రం ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. దీనికి తగ్గట్టే వసూళ్లలో రికార్డులు సృష్టిస్తోంది మెగాస్టార్‌ మూవీ. సంక్రాంతి కానుకగా శుక్రవారం (జనవరి 13)న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన వాల్తేరు వీరయ్య మూడురోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించించారు మైత్రీ మూవీ మేకర్స్. ఈ సందర్భంగా వాల్తేరు వీరయ్య మెగా మాస్ బ్లాక్ బస్టర్ అని పేర్కొంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. తొలి మూడు రోజుల్లోనే 108 కోట్ల గ్రాస్ రాబట్టి మెగాస్టార్ బాక్సాఫీస్ బాస్ అయ్యారని తెలిపారు. ఏనుగుపై కూర్చొని ఉన్న చిరంజీవి కొత్త పోస్టర్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

కాగా రిలీజైన మొదటి రోజు రూ.55 కోట్లకుపైనే గ్రాస్ వసూళ్లు సాధించిన మెగాస్టార్‌ సినిమా రెండో రోజు నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ .75.50 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇక ఓవర్సీ్‌లోనూ రికార్డులు కొల్లగొడుతోంది వాల్తేరు వీరయ్య. ఇప్పటివరకు అమెరికాలో1.6 మిలియన్ డాలర్ల మేర కలెక్షన్స్‌ను రాబట్టింది. ప్రస్తుతమున్న జోరు చూస్తుంటే వాల్తేరు వీరయ్య సినిమా త్వరలోనే150 కోట్ల గ్రాస్ ని రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. కే.ఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మాస్ మహారాజ ఓ కీలక పాత్ర పోషించాడు. శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..