Travelling: ఉబెర్, ఓలా తో విసిగిపోయారా? మీకోసమే వచ్చేస్తోంది సరికొత్త యాప్..
ఉబర్, ఓలాతో విసిగిపోయారా? యాప్‌ల అధిక ఛార్జీలు, పదే పదే రైడ్ క్యాన్సిల్ చేయడంతో చిరాకుపడుతున్నారా? ఇక నుంచి ఆ సమస్యే లేకుండా చేస్తామంటోంది సరికొత్త యాప్.
ఉబర్, ఓలాతో విసిగిపోయారా? యాప్‌ల అధిక ఛార్జీలు, పదే పదే రైడ్ క్యాన్సిల్ చేయడంతో చిరాకుపడుతున్నారా? ఇక నుంచి ఆ సమస్యే లేకుండా చేస్తామంటోంది సరికొత్త యాప్. అవును, ఉబర్, ఓలాకు ప్రత్యామ్నాయంగా మరో గ్లోబర్ రైడ్ హెయిలింగ్ యాప్ ‘InDrive’ పేరుతో భారతదేశంలో సేవలు అందిస్తోంది. ఇప్పటికే ఈ యాప్ దేశ రాజధాని ఢిల్లీ సహా కోల్‌కతా నగరాల్లో పని చేస్తుంది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు కసరత్తు చేస్తుంది.
ఈ యాప్ సేమ్ ఓలా, ఉబర్ మాదిరిగానే పని చేస్తుంది. యాప్ వినియోగదారులు తమ నగరంలో ఇంటర్ సిటీ రైడ్‌లను బుక్ చేసుకోవచ్చు. డెలివరీ ఆర్డర్స్ కూడా చేయొచ్చు. అంతేకాదండోయ్.. డ్రైవర్, కొరియర్‌గా కూడా చేరవచ్చు. ఇందులో అధిక ధరలు ఉండవని యాప్ నిర్వాహకులు చెబుతున్నారు. అటు రైడర్‌కి, ఇటు డ్రైవర్‌కి ఇద్దరికీ ఆమోదయోగ్యమైన ధరలే ఉంటాయంటోంది.
అసలు ఈ InDrive సంగతి ఏంటి?
InDrive యాప్ ప్రయాణీకులను క్యాబ్, ఆటో, డెలివరీ బుక్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో ఉంది. ఈ యాప్‌ని 2013లో ప్రారంభించారు. ఈ యాప్ దాదాపు 47 దేశాలలో పని చేస్తుంది. డౌన్‌లోడ్‌ల పరంగా ప్రపంచ వ్యాప్తంగా రెండవ అతిపెద్ద రైడ్ షేరింగ్, ట్యాక్సీ యాప్‌గా పేరుపొందింది. ఈ యాప్ ముందుగా InDriver పేరుతో మొదలవగా.. 2022లో దీనిని InDrive గా రీబ్రాండ్ చేశారు. InDrive ఏప్రిల్ 2022లో కోల్‌కతాలో సేవలను ప్రారంభించింది. తర్వాత నవంబర్‌లో ఢిల్లీలో యాప్‌ను ప్రారంభించడం జరిగింది.
InDriveని ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
Google Play, Apple యాప్ స్టోర్‌లో InDriveని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్‌ను 100 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు.
InDrive ఎలా ఉపయోగించాలి?
మొబైల్ నెంబర్ సహాయంతో యాప్‌లో అకౌంట్ సెటప్ చేసుకోవచ్చు. ఓటీపీ ద్వారా మొబైల్ నెంబర్‌ను ధృవీకరించడం జరుగుతుంది. ఆ తరువాత మీకు అవసరమైన రూట్‌లో క్యాబ్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా అప్‌డేట్స్ ఇస్తుంది. ఈ యాప్ హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, బంగ్లా సహా నాలుగు భాషలలో అందుబాటులో ఉంది.
ఇంట్రస్టింగ్ ఫీచర్..
ఈ యాప్‌లో ఆసక్తికరమైన ఫీచర్ ఉంది. అదేంటంటే.. ఛార్జీల విషయంలో బేరమాడొచ్చు. అవును, ఛార్జీల గురించి కోరవచ్చు. యాప్‌లో పికప్, డ్రాప్ లొకేషన్‌ను ఎంటర్ చేసిన తరువాత.. ఛార్జీల విషయంలో చర్చించేందుకు అవకాశం ఇస్తుంది ఇన్‌డ్రైవ్. వినియోగదారుడు అసమంజమైన ధరను ఇన్‌పుట్ చేస్తే.. కావాల్సిన ధరను అప్‌డేట్ చేయమని ఇన్‌డ్రైవ్ సూచిస్తుంది. ఉదాహరణకు చూసుకుంటే.. పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు ధర రూ. 200 అయితే, వినియోగదారుడు రూ. 150 ఇన్‌పుట్ చేస్తే అది డ్రైవర్‌లకు కనిపిస్తుంది. అప్పుడు ఆ ధరకు వారు రైడ్ చేయొచ్చో లేదో నిర్ణయించుకునే ఆస్కారం ఉంటుంది. అంతేకాదు.. యాప్ జీరో సర్జ్‌ను కూడా అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..