Viral Video: మాయమైపోతున్న మానవత్వం.. సిగ్నల్ దగ్గర ఆగిన వారిపై వేగంగా దూసుకెళ్లిన కారు.. గాయపడిన వారిని చూస్తూ వెళ్లిపోయిన ఓ వ్యక్తి..

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..  ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఒక వ్యక్తి బైక్ నడుపుతూ అటు వెళ్ళాడు. గాయపడిన వారికి సహాయం చేసే బదులు ప్రమాదాన్ని చూస్తూ.. అక్కడ నుండి హాయిగా వెళ్ళిపోయాడు. ఈ  దారుణ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు.. కానీ హృదయ విదారకంగా ఉంది వీడియో.. 

Viral Video: మాయమైపోతున్న మానవత్వం.. సిగ్నల్ దగ్గర ఆగిన వారిపై వేగంగా దూసుకెళ్లిన కారు.. గాయపడిన వారిని చూస్తూ వెళ్లిపోయిన ఓ వ్యక్తి..
Accident Video
Follow us
Surya Kala

|

Updated on: Jan 11, 2023 | 11:13 AM

ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ప్రతిరోజూ  వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని ప్రమాదాలు సాధారణం కాగా.. మరికొన్ని ప్రమాదాలు భయంకరంగా ఉంటాయి. కొందరు అతివేగం వల్ల ఒకొక్కసారి ప్రమాదాల బారిన పడుతుండగా.. మరొకొందరు ఇతరులు చేసే తప్పుల వలన ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇలాంటి ప్రమాదాల బారిన పడినా లక్కీ తప్పించుకునే వీరు కొందరైతే.. మరొకొందరు చిన్న చిన్న గాయాలతో భయపడతారు.. ఇంకొందరు.. ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. అందుకనే ప్రభుత్వాలు ట్రాఫిక్ రూల్స్ ను పాటించమని కోరుతూనే ఉంటుంది. తాజాగా ఓ ఘోర రోడ్డు ఒక ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రాఫిక్ రూల్స్ ని పాటిస్తూ.. ప్రాణాలు పోగొట్టుకున్నారు కొందరు..

వైరల్ వీడియోలో స్కూటీ నడుపుతున్న ముగ్గురు అమ్మాయిలు రెడ్ లైట్ పడడంతో సిగ్నల్స్ దగ్గర బండిని ఆపి హాయిగా ఉన్నట్లు చూడవచ్చు. ఇంతలో అతి వేగంతో ఓ కారు వచ్చింది.. అదుపు తప్పిన ఆ కారు.. ఆగి ఉన్న వాహనదారులను వెనుక నుంచి ఢీ కొట్టి ఓవర్ టేక్ చేసింది. ఈ ఘటనలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఒక స్కూటీ అమ్మాయి మాత్రం సేఫ్ గా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారు మాత్రం బతికి ఉండే ఛాన్స్ లేదు.. ఎందుకంటే.. కారు ఢీ కొట్టడంతో.. మిగిలిన ఇద్దరు వాహనదారులు ఎగిరి పడ్డారు.. వారి మీద నుంచి వాహనం వెళ్లినట్లు తెలుస్తోంది. దెబ్బలు తగిన రైడర్ రోడ్డుపై పడుతున్న బాధను చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..  ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఒక వ్యక్తి బైక్ నడుపుతూ అటు వెళ్ళాడు. గాయపడిన వారికి సహాయం చేసే బదులు ప్రమాదాన్ని చూస్తూ.. అక్కడ నుండి హాయిగా వెళ్ళిపోయాడు. ఈ  దారుణ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు.. కానీ హృదయ విదారకంగా ఉంది వీడియో..

ఈ వీడియో @ViciousVideos అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కేవలం 9 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 26 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను కూడా లైక్ చేశారు. అదే సమయం ఇది యాక్సిడెంట్ కాదు..  హత్య అని కొందరంటే.. ఓ అమ్మాయి పెద్దగా గాయాలు తగలేకపోవడంతో.. ఆమె అదృష్టవంతురాలని మరికొందరు అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..