Viral Video: అండమాన్ అయినా ఆస్ట్రేలియా అయినా ఒకటే… భారతీయులు అంటే ఆ మాత్రం ఉంటుంది మరి..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. ఇది చాలా ఫన్నీగా ఉంది. ఈ వీడియోలో కొంతమంది భారతీయలు ..  ఫారెన్ బీచ్‌లోనే హిందీ పాటలు ప్లే  చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఓ టేప్ రికార్డ్ ను తీసుకుని.. స్పీకర్ తీసుకుని బీచ్ మొత్తం నడిచారు.

Viral Video: అండమాన్ అయినా ఆస్ట్రేలియా అయినా ఒకటే... భారతీయులు అంటే ఆ మాత్రం ఉంటుంది మరి..
Viral Video
Follow us

|

Updated on: Jan 08, 2023 | 8:24 PM

ప్రపంచంలో భారతీయులు ఎక్కడికి  ఏ మారు మూల ప్రాంతానికి వెళ్లినా అక్కడ తమదైన వాతావరణాన్ని సృష్టించుకుంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ‘దేశం మారినా.. భాష, వేషం, తీరు మారలేదు..  అంటారు భారతీయులు. తామున్న దేశంలో అక్కడ స్థానిక పద్దతుల ప్రకారం నడుచుకుంటూనే.. తమదైన స్టైల్ లో సొంతంగా ఉనికిని ఏర్పాటు చేసుకుంటారు. దీనికి ఉదాహరణగా నిలుస్తుంది.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. ఇది చాలా ఫన్నీగా ఉంది. ఈ వీడియోలో కొంతమంది భారతీయలు ..  ఫారెన్ బీచ్‌లోనే హిందీ పాటలు ప్లే  చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఓ టేప్ రికార్డ్ ను తీసుకుని.. స్పీకర్ తీసుకుని బీచ్ మొత్తం నడిచారు. అందులోనూ ఊరేగింపుతో బయలు దేరినట్లుగా పాటను ప్లే చేశారు. నిజంగా..  భారతీయుల ఈ స్టైల్ చాలా అద్భుతంగా ఉంది.

ఆస్ట్రేలియాలోని ఓ బీచ్‌లో భారతీయులు తమ అద్భుత శైలిని ప్రదర్శించారు. బీచ్‌లో కొందరు అటు ఇటు తిరుగుతుండగా.. మరికొందరు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంతలో, కొంతమంది భారతీయ యువకులు వెళుతున్నారు. అయితే ఒక యువకుడు మంచి రొమాంటిక్ స్టైల్‌లో ఓ స్పీకర్ ను వేసుకుని స్టైల్ గా నడుస్తున్నాడు. ఆ మ్యూజిక్ సిస్టమ్‌లో ‘ఆయే హమ్ బరాతీ బారాత్ లేకే’ పాట ప్లే అవుతోంది. ఈ పాట అజయ్ దేవగన్ , కరిష్మా కపూర్ నటించిన ‘జిగర్’ చిత్రంలోనిది. కుమార్ సాను .. కవితా కృష్ణమూర్తి పాడారు. పెళ్లిళ్లలో ఈ పాటను ఎక్కువగా ప్లే చేస్తూ ఉంటారు ఈ సాంగ్ ను.. అయితే ఇప్పటి వరకూ ఎవరూ ఈ పాటను బీచ్‌లో  అదీ  ఆస్ట్రేలియన్ బీచ్‌లో ప్లే చేయడాన్ని చూసి ఉండరు. భారతీయ యువత ఈ శైలిని నెటిజన్లు ఇష్టపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో dream_dollarr అనే ఐడితో షేర్ చేయబడింది. ఇది ఇప్పటివరకు 2.9 మిలియన్ వ్యూస్ ను, 3 లక్షలల లైక్స్ ను సొంతం చేసుకుంది. ‘యూపీ-బీహార్ ప్రజలు ఉండి ఉంటే ఇంతకంటే మంచి పాట ప్లే అయ్యేది’ అని కొందరు అంటున్నారు. అదే సమయంలో, ‘ఆస్ట్రేలియా ప్రజల స్పందన ఎలా ఉండేదో… దాని గురించి ఆలోచించండి’ అని ఒకరు కామెంట్ చేశారు..

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..