Shocking: ఎయిర్‌పోర్టులో మహిళ హ్యాండ్ బ్యాగ్‌లోంచి వింత శబ్ధాలు.. స్కాన్ చేసి చూస్తే గుండె గుభేల్..
చాలా మందికి జంతువులను పెంచుకోవడం ఇష్టం. తమ తమ ఇళ్లల్లో కక్కలు, పిల్లి, కుదిరితే పక్షలును పెంచుకుంటారు. మరికొందరైతే.. పెద్ద పెద్ద జంతువులను సైతం పెంచుకుంటారు.
చాలా మందికి జంతువులను పెంచుకోవడం ఇష్టం. తమ తమ ఇళ్లల్లో కక్కలు, పిల్లి, కుదిరితే పక్షలును పెంచుకుంటారు. మరికొందరైతే.. పెద్ద పెద్ద జంతువులను సైతం పెంచుకుంటారు. ఇంకొందరు జంతు ప్రేమికులు పాములను కూడా సాదుతుంటారు. ఒకవేళ వారు ఎక్కడికైనా వెళ్తే.. వాటిని కూడా తమ వెంట తీసుకెళ్తుంటారు. తాజాగా ఓ మహిళ కూడా ఇదే పని చేసింది. అయితే, ఆమె చేసిన ఈ పనికి ఎయిర్‌పోర్ట్ అధికారులు హడలిపోయారు. వెంటనే ఆమెను విమానం ఎక్కకుండా ఆపేసి.. ఇదేం పని తల్లి అంటూ ప్రశ్నించారు. ఇంతకీ ఆ బ్యాగ్‌లో ఏముంది? ఎయిర్ పోర్ట్ అధికారులు ఎందకంత హడలిపోయారో ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం..
సాధారణంగా విమాన ప్రయాణం అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు విమానాశ్రయ అధికారులు. విమానంలో ఎలాంటి ప్రమాదకారకాలు ఉండకుండా ముందే జాగ్రత్తపడుతారు. అలాంటిది ఓ మహిళ ఏకంగా తన వెంట పామును తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. తన హ్యాండ్ బ్యాగ్‌లో పెంపుడు పామును పెట్టుకుని వెళ్లింది. అయితే, విమానాశ్రయంలో మహిళ బ్యాగ్ అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు దానిని స్కాన్ చేశారు. అందులో పాము ఉన్నట్లు గుర్తించి షాక్ అయ్యారు అధికారులు. ఈ ఘటన అమెరికాలోని టంపా అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. నాలుగు అడుగుల పొడవైన పామును మహిళా ప్యాసింజర్ బ్యాగులో గుర్తించారు అధికారులు. ఇందుకు సంబంధించిన విజువల్స్‌ను ఎయిర్‌లైన్ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశారు. ‘ఈ బ్యాగ్‌లో డేంజర్ నూడిల్ ఉంది. ప్రయాణికురాలి క్యారీ బ్యాగ్‌లో దాగి ఉన్న ఈ పాము బోవా కన్‌స్ట్రిక్టర్. ఎక్స్ రే మిషిన్ ద్వారా దీనిని గుర్తించడం జరిగింది.’ అని క్యాప్షన్ పెట్టారు. అలాగే, ఎవరైనా విమాన ప్రయాణం చేసే ముందు ఎయిర్‌లైన్స్ నిర్దేశించిన నియమాలను చెక్ చేసుకోవాల్సిందిగా ప్రయాణికులను కోరారు అధికారులు.
అయితే, ఈ పాము పేరు బర్తోలోమ్యూ అని, అదంటే తనకు చాలా ఇష్టం, పెంపుడు జంతువు అంటూ సదరు ప్రయాణికురాలు వివరించింది. ఇది విష రహితమై పాము అయినప్పటికీ.. ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఆమెను విమానంలోకి అనుమతించలేదు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..