Viral Video: డేంజర్ కాదు అంతకంటే ఎక్కువ.. ఈ రాక్షసి చేపను చూస్తే మీ ఒళ్ళు జలదరించడం ఖాయం

ప్రజలు తమ కళ్లను తామే నమ్మలేని విధంగా ఓ చేప ఉంది. ఇది తాను బతికే ఉన్నాను అని తెలిసే విధంగా కదిలింది కూడా.. భయంకరంగా కనిపిస్తున్న ఈ చేప పేరు సిర్కటి చేప.

Viral Video: డేంజర్ కాదు అంతకంటే ఎక్కువ.. ఈ రాక్షసి చేపను చూస్తే మీ ఒళ్ళు జలదరించడం ఖాయం
Fish Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Jan 07, 2023 | 4:36 PM

Viral Video: సముద్రంలో అనేక వింతలు, విశేషాలున్నాయి. చిత్ర విచిత్రమైన జీవులు అక్కడ కనిపిస్తాయి. కొన్నిటిని చూస్తే ఎవరికైనా  గూస్‌బంప్‌లు వస్తాయి. లోతైన సముద్రంలో కనిపించే కొన్ని జీవులు చేపలతో సహా చాలా ప్రమాదకరమైనవి ఉన్నాయి. ప్రజలు సాధారణంగా చేపలను తింటారు.. అయితే సముద్రపు లోతులలో కనిపించే కొన్ని చేపలు తినడం అన్న ఆలోచన కాదు కదా .. కనీసం వాటిని చూడడానికి కూడా భయపెట్టేవిలా ఉంటాయి.  సముద్ర చేపల్లో ఒక వింత చేప.. సిర్కటి చేపలను చూశారా.. అది కూడా జీవించి ఉన్న చేపను చూశారా.. ప్రస్తుతం అలాంటి చేపకు చెందిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చేపను చూస్తే ఎవరికైనా ఒళ్ళు జలదరిస్తుంది.. ఇంద్రియాలు ఎగిరిపోతాయి.

వాస్తవానికి, ఈ వీడియోలో.. ప్రజలు తమ కళ్లను తామే నమ్మలేని విధంగా ఓ చేప ఉంది. ఇది తాను బతికే ఉన్నాను అని తెలిసే విధంగా కదిలింది కూడా.. భయంకరంగా కనిపిస్తున్న ఈ చేప పేరు సిర్కటి చేప. ఈ వీడియోలో.. తెగిపడిన తలతో ఉన్న ఒక పెద్ద చేప కనిపిస్తుంది. ఈ  తల తప్ప శరీరం లేని చేప పెద్ద నోరు తెరిచినట్లు మీరు చూడవచ్చు. దానిని చూస్తుంటే చనిపోయినట్లు అనిపిస్తుంది ఎవరికైనా..  ఎందుకంటే చేప తల ను  శరీరం వేరు చేశారు.. కనుక ఆ చేప చనిపోయిందని అందరూ భావిస్తారు. కానీ ఈ సమయంలో, ఒక వ్యక్తి చేప  నోటిలో కోక్ డబ్బాను ఉంచడానికి ప్రయత్నించాడు.. అకస్మాత్తుగా ఆ చేప ఆ కోక్ డబ్బాను పట్టుకుంది. ఆ డబ్బాను గట్టిగా తన నోటితో పట్టుకోవడంతో డబ్బా నలిగిపోయింది. అంతేకాదు ఆ డబ్బానుంచి డ్రింక్ బయటకు వచ్చింది. ఈ దృశ్యం చూసిన వారి పరిస్థితి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..

ఇవి కూడా చదవండి

 ఈ వీడియో చూడండి

సిర్కటి చేపకు సంబంధించిన ఈ అద్భుతమైన వీడియో @ViciousVideos అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ఇది సజీవంగా ఉంది!’. కేవలం 10 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 29 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది లైక్ చేశారు.  వీడియో చూసిన నెటిజన్లు డిఫరెంట్ గా స్పందించారు.. ‘చనిపోయిన తర్వాత కూడా ఈ చేప కోపంగా కనిపిస్తోంది’ అని కొందరంటే, ‘మృత్యువుతో పోరాడుతోంది’ అని కొందరు అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే