Trending: ఇంకెప్పుడు రా బాబూ మార్పు వచ్చేది.. దళిత మహిళ గుడిలోకి వచ్చిందని.. పూజారి ఏం చేశాడంటే..
దేవుడు.. అందరికీ సమానమే. ఒకరికి ఎక్కువ. ఇంకొకరికి తక్కువ అనే తేడా ఉండదు. ఎవరికీ తోచినట్లు వారు తమకు ఇష్టమైన భగవంతుడిని ప్రార్ఱించుకుంటుంటారు. దేవుడి దర్శనానికి గుళ్లకు వెళ్లకుండా...
దేవుడు.. అందరికీ సమానమే. ఒకరికి ఎక్కువ. ఇంకొకరికి తక్కువ అనే తేడా ఉండదు. ఎవరికీ తోచినట్లు వారు తమకు ఇష్టమైన భగవంతుడిని ప్రార్ఱించుకుంటుంటారు. దేవుడి దర్శనానికి గుళ్లకు వెళ్లకుండా కులమతాల ప్రాతిపదికన ఎవరూ అడ్డుకోరు. అయితే అప్పుడప్పుడు మాత్రం కొన్ని షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. తక్కువ కులాల వారిని గుడి లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటుంటారు. వారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తారు. వారి మాటను ధిక్కరించి.. గుళ్లోకి వెళ్తే పైశాచికంగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం అలాంటి ఘటనే జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన బెంగళూరులోని అమృతహళ్లి ప్రాంతంలోని ఓ దేవాలయంలో జరిగింది. ఈ ఘటనపై బాధితురాలు అమృతహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ దళిత మహిళ ఆలయానికి వెళ్లింది. దేవుడికి నమస్కరించింది. కోరికను మనసులో కోరుకుంది. ఈ ఘటనను గమనించిన పూజారి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దారుణంగా కొట్టాడు. గుడి లోనుంచి బయటకు ఈడ్చుకెళ్లాడు. జుట్టు పట్టుకుని లాక్కెళ్లాడు. మహిళను గుడి నుంచి బయటకు తీసుకెళ్తుండగా.. ఆమె తనను వదిలేయాలని ప్రాధేయపడింది. అయినా అతను ఏ మాత్రం కనికరించకుండా బయటకు లాక్కెళ్లి.. సదరు మహిళను విచక్షణా రహితంగా కొట్టాడు.
This is from #Bengaluru, #Karnataka.
Dalit women Assaulted By Temple Administration Board Member, And Restrict Her to Entered Gods Darshan.
Victim Filed Complaints Against Accused at Amrtuhalli Police Station.#Bangalore #Amrtuhalli #Dalit #Casteism #DalitLivesMatter pic.twitter.com/OUnhdaXXcx
— Hate Detector ? (@HateDetectors) January 6, 2023
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళ పట్ల దారుణంగా వ్యవహరించిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 2023లో కూడా ఇలాంటి ఘటన జరిగడం సిగ్గు చేటని విమర్శిస్తున్నారు. నిందితులు జైలులో ఉండాల్సిందేనని ఫైర్ అవుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..