Race Video Viral: స్పోర్ట్స్ బైక్ రేసర్ తో పోటీపడిన స్కూటీ వాలా.. ఎవరు గెలిచారో తెలిస్తే షాక్..

వాస్తవానికి స్పోర్ట్స్ బైక్ రోడ్డుపైకి వచ్చిందంటే చాలు.. అందరి దృష్టి దానివైపే ఉంటుంది. ఆ స్పోర్ట్స్ బైక్ ను నడుపుతున్న వ్యక్తిని ఆసక్తిని గమనిస్తారు.. ఇక స్పోర్ట్స్ బైక్ ను నడుపుతున్న వ్యక్తి తనను తాను హీరోగా గ్రౌండ్ రైడర్‌గా భావించడం ప్రారంభిస్తాడు.

Race Video Viral: స్పోర్ట్స్ బైక్ రేసర్ తో పోటీపడిన స్కూటీ వాలా.. ఎవరు గెలిచారో తెలిస్తే షాక్..
Race Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Jan 07, 2023 | 2:24 PM

ప్రస్తుతం ప్రపంచంలో ఎప్పుడు, ఎక్కడ ఏమి జరిగినా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతాయి. వైరల్ అవుతున్న వీడియోలో రకరకాలున్నాయి. ఈ వీడియోలు నేటి కాలంలో ప్రజల వినోదానికి ప్రధాన సాధనంగా మారింది. కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన, కొన్నిసార్లు ఫన్నీ వీడియోలు కనిపిస్తూ అలరిస్తుంటాయి. అయితే నెట్టింట్లో భిన్నమైన వీడియోలు చాలానే ఉన్నాయి , వీటిని చూస్తే కొన్ని సార్లు నిజమేనా అనిపిస్తుంది. నమ్మాలనిపించదు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది, ఇది ఖచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.

వాస్తవానికి స్పోర్ట్స్ బైక్ రోడ్డుపైకి వచ్చిందంటే చాలు.. అందరి దృష్టి దానివైపే ఉంటుంది. ఆ స్పోర్ట్స్ బైక్ ను నడుపుతున్న వ్యక్తిని ఆసక్తిని గమనిస్తారు.. ఇక స్పోర్ట్స్ బైక్ ను నడుపుతున్న వ్యక్తి తనను తాను హీరోగా గ్రౌండ్ రైడర్‌గా భావించడం ప్రారంభిస్తాడు. ఒకొక్కసారి తన తో పాటు ప్రయాణిస్తున్న వాహనాలను దాటుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. ప్రస్తుతం అలాంటి బైక్ రేస్ వీడియో ఒకటి హల్ చల్ చేస్తోంది. అయితే ఈ వీడియో స్పోర్ట్ బైక్ రైడర్ ను ఒక స్కూటీ వాలా బీట్ చేశాడు. దీంతో రేసు మధ్యలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

రోడ్డుపై భారీ వర్షం కురుస్తోంది.. దీంతో రోడ్డు మొత్తం తడిసిపోయినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ సమయంలో క్లిప్‌లో బైక్ రైడర్ వేగంగా బైక్ నడుపుతూ వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఆ బైక్ స్పీడ్ చూస్తుంటే ఎవరికైనా సరే.. బైక్ పొరపాటున జారిపోతే ప్రమాదం తప్పదనిపిస్తుంది. ఇంతలో..  ఒక స్కూటర్ వాలా బైక్ రైడర్ తో పోటీ పడ్డాడు. ఎంతో ఉత్సాహంగా ఉన్న స్కూటీవాలా ..  బైక్ రైడర్ కి సవాల్ విసిరాడు. అటువంటి పరిస్థితిలో.. ఎవరైనా సరే.. స్పోర్ట్స్ బైక్ ఉన్న వ్యక్తి పోటీలో సులభంగా గెలుస్తాడని అందరూ భావిస్తారు… అయితే ఇక్కడ స్కూటర్ నడుపుతున్న యువకుడు.. అత్యంత వేగంతో తన స్కూటీని నడిపి బైక్ రైడర్ ను ఓడించి ముందుకు వెళ్ళాడు.  ఇప్పటి వరకూ ఈ వీడియో అనేక మందిని ఆకట్టుకుంది. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..