AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bike Stunt Video: హైవేపై బైక్‌తో స్టంట్ చేయబోయి రోడ్డు మీద పడిన యువకుడు.. నెక్స్ట్ జరిగిన సంఘటన చూస్తే షాక్ తింటారు..

హైవేపై ఒక యువకుడు తన బైక్‌ను అవసరమైన దానికంటే వేగంగా నడుపుతున్నాడు. అయితే బైక్ నడుపుతున్న యువకుడు మనస్సులో ఏమి ఆలోచించాడో ఏమో.. అతను అకస్మాత్తుగా బైక్ ముందు భాగాన్ని గాలిలో లేపి.. కదులుతున్న బైక్‌పై విన్యాసాలు చేసి చూపించడం మొదలు పెట్టాడు

Bike Stunt Video: హైవేపై బైక్‌తో స్టంట్ చేయబోయి రోడ్డు మీద పడిన యువకుడు.. నెక్స్ట్ జరిగిన సంఘటన చూస్తే షాక్ తింటారు..
Bike Stunt Video
Follow us
Surya Kala

|

Updated on: Jan 06, 2023 | 12:37 PM

సోషల్ మీడియాలో ఎవరు, ఎపుడు వైరల్ అవుతారో తెలియదు. ఎందుకంటే సోషల్ మీడియా ప్రపంచం చాలా ప్రత్యేకమైనది.  విభిన్నమైనది. పేజీలను స్క్రోల్ చేస్తూ ఉంటే.. ఒకొక్కసారి అకస్మాత్తుగా ఒక వీడియో లేదా ఒక ఫోటో మనసుని ఆకట్టుకుంటుంది. దానిమీదనే దృష్టి నిలిచిపోతుంది. ఆపై లైక్‌లు , షేర్‌లు వరద వెల్లువెత్తుతోంది. అయితే ఇలా వైరల్ అవుతున్న వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉండి నవ్వు తెప్పిస్తాయి. కొన్ని వీడియోలు చూస్తే మనం షాక్ అవుతాము. ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో  చర్చనీయాంశంగా మారింది. ప్రజలను ఆశ్చర్యపరిచింది.

నేటి కాలంలో యువతలో స్టంట్స్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఈ క్రేజ్ ఏ రేంజ్ కి చేరుకుందంటే.. నెక్స్ట్ ఏమిటి అనే విషయాన్ని  ఆలోచించకుండా రోడ్డుపై విన్యాసాలు చేయడానికి బయలు దేరుతున్నారు.. అయితే స్టంట్స్ చేయడం పిల్లల ఆట కాదు. ఎలాంటి స్టంట్ చేయాలన్నా చాలా ప్రాక్టీస్ అవసరం.. అప్పుడు అందులో పర్ఫెక్షన్ ఉంటుంది. ఎటువంటి శిక్షణ, నిపుణుల పర్యవేక్షణ లేకుండా చేసే స్టంట్స్ లో  చిన్న పొరపాటు జరిగినా, స్టంట్ ఫెయిల్ కావడం ఖాయం. అదే సమయంలో ఆ స్టంట్స్ చేసిన వ్యక్తికీ మాత్రమే కాదు.. ఇతరులను కూడా ప్రమాదాల బారిన పడేటట్లు చేస్తుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో స్టంట్ చేస్తున్న  సమయంలో రైడర్ పొరపాటు చేశాడు.. ఈ క్లిప్‌ను చూస్తే ఆ బైక్ రైడర్ టెంపరి తనంపై కోపాన్ని వ్యక్తం చేస్తారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి:

వైరల్ అవుతున్న వీడియోలో..  హైవేపై ఒక యువకుడు తన బైక్‌ను అవసరమైన దానికంటే వేగంగా నడుపుతున్నాడు. అయితే బైక్ నడుపుతున్న యువకుడు మనస్సులో ఏమి ఆలోచించాడో ఏమో.. అతను అకస్మాత్తుగా బైక్ ముందు భాగాన్ని గాలిలో లేపి.. కదులుతున్న బైక్‌పై విన్యాసాలు చేసి చూపించడం మొదలు పెట్టాడు. అకస్మాత్తుగా వెనుకకు వంగి, ఒక చేత్తో రహదారిని తాకడానికి ప్రయత్నించాడు. అయితే ఆ యువకుడు తన చేతితో రోడ్డును తాకగానే, కారు బ్యాలెన్స్ చేయలేకపోయాడు.. దీంతో ఆ యువకుడు ఆ బైక్ తో సహా రోడ్డుమీద పడిపోయాడు. అదే సమయంలో రోడ్డుమీద అతని వెనుక వస్తున్న వాహనదారులకు కూడా ఇబ్బంది కలిగింది. ఆ యువకుడు పడిపోయిన వెంటనే.. అతడిని ఢీ కొని వెనుక ఉన్న రైడర్లందరరూ పడిపోయారు.

ఈ వీడియో Instagramలో __duke_390__lover_0 అనే ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోను 84 వేల మందికి పైగా లైక్ చేయగా, లక్షల మంది చూశారు. ఒకరు టాటా-టాటా బాయ్-బాయ్ ఇలా ముగిసిందని రాశారు. అదే సమయంలో, మరొకరు  ” అతి తెలివి ఉన్న  వ్యక్తులకు ఇలా జరుగుతుందని కామెంట్ చేయగా.. మరొకొందరు.. ఇలాంటి విన్యాసాలు అతనికి మాత్రమే కాదు ఇతరులకు కూడా నష్టాన్ని కలిగిస్తాయని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..