Bride Video Viral: పెళ్లిరోజున జుట్టును కట్ చేసుకున్న వధువు.. క్యాన్సర్ పేషెంట్లకు డొనేషన్

తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో చూడండి. ఒక వధువు తన వివాహ సమయంలో తన జుట్టును కత్తిరించుకుంది. ఇందుకు ఆ పెళ్లికూతురు చెప్పిన రీజన్ వింటే ఎవరైన సరే హర్షం వ్యక్తం చేస్తారు.

Bride Video Viral: పెళ్లిరోజున జుట్టును కట్ చేసుకున్న వధువు.. క్యాన్సర్ పేషెంట్లకు డొనేషన్
Bride Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Jan 06, 2023 | 12:51 PM

చాలా మంది తమ పెళ్లి రోజు చాలా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. పెళ్లిళ్లు కూడా అందరికీ గుర్తుండిపోయేలా డిఫరెంట్‌గా జరుపుకుంటారు. ఇలాంటి పెళ్లిళ్ల వీడియోలు చాలా చాలా సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉన్నాయి. అయితే కొన్ని వీడియోలు ఫన్నీగా ఉండి నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉండి ఆలోచించేవిగా ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో చూడండి. ఒక వధువు తన వివాహ సమయంలో తన జుట్టును కత్తిరించుకుంది. ఇందుకు ఆ పెళ్లికూతురు చెప్పిన రీజన్ వింటే ఎవరైన సరే హర్షం వ్యక్తం చేస్తారు.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

ఇవి కూడా చదవండి

క్యాన్సర్ రోగుల కోసం పెళ్లికూతురు తన జుట్టును దానం చేసింది. ఆమె క్యాన్సర్‌తో తన తల్లిని కోల్పోయింది. అప్పుడు తల్లి పడిన బాధను గుర్తు చేసుకుని వధువు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. క్యాన్సర్ వచ్చినప్పుడు అమ్మాయిలు ఎదుర్కొనే అతిపెద్ద సవాలు జుట్టు. ఆ బాధ తనకు తెలుసు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నానని వధువు చెప్పింది. వధువు జుత్తునిస్తున్న సమయంలో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ.. కన్నీరు పెట్టుకున్నారు. వరుడు కూడా వధువు నిర్ణయాన్ని గౌరవించాడు.

ఈ వీడియోను ఇప్పటికే లక్ష మందికి పైగా వీక్షించారు. 1,64,000 మంది లైక్ చేసారు. ఇది అద్భుతమైన నిర్ణయమని కొందరు అంటున్నారు. నేను క్యాన్సర్ సర్వైవర్‌ని. క్యాన్సర్ రాకముందు చాలాసార్లు జుట్టు దానం చేశాను. ఇప్పుడు నేను జుట్టు ప్రాముఖ్యత గురించి మరింత అర్థం చేసుకున్నాను.  మీరు శరీరకంగానే కాదు.. మానసికంగా కూడా అందంగా ఉన్నారు.. మీరు అదృష్టవంతులు మంచి మనసున్న భార్యని పొందుతున్నారని భర్తని గుర్తించి వ్యాఖ్యానించారు

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..