ఎలుక-పిల్లి ఫైటింగ్.. రియల్ టామ్ అండ్ అంటున్న నెటిజనం !!
మనలో చాలా మందికి టామ్ అండ్ జెర్రీ కార్టూన్ గురించి తెలిసిందే. పిల్లిని ముప్పు తిప్పలు పెడుతూ ఎలుక చేసే అల్లరి చూస్తే నవ్వాగదు. ఆ రెండూ తెగ కొట్టుకుంటాయి.. మళ్లీ కలిసిపోతాయి.
మనలో చాలా మందికి టామ్ అండ్ జెర్రీ కార్టూన్ గురించి తెలిసిందే. పిల్లిని ముప్పు తిప్పలు పెడుతూ ఎలుక చేసే అల్లరి చూస్తే నవ్వాగదు. ఆ రెండూ తెగ కొట్టుకుంటాయి.. మళ్లీ కలిసిపోతాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో సేమ్ టూ సేమ్ టామ్ అండ్ జెర్రీ కార్టూన్ ను తలపించే దృశ్యం కనిపిస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఎలుక వెంట పడింది ఓ పిల్లి. అయితే ఆ పిల్లికి ఊహించని షాకిచ్చింది ఎలుక. తనను చూసి పరుగెడుతున్న ఎలుక ఒక్కసారిగా ఆగిపోయింది. దాంతో పిల్లి కంగారు పడింది. ఎలుక అంతటితో ఆగకుండా పిల్లిని తన చిన్న చిన్న కాళ్లతో కొడుతుంది. కానీ పిల్లి మాత్రం ఎలుకకు ఎలాంటి హాని కలిగించలేదు. వైరల్ అవుతున్న ఈ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ‘మీ ప్రత్యర్థిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దు’ అనే క్యాప్షన్ పెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమంటే ఇదేరా.. ప్రియుడి స్థానంలో పరీక్ష రాసిన ప్రియురాలు.. ఎలా దొరికారబ్బా
రైలు పట్టాలపై ట్రక్.. దూసుకొచ్చిన గూడ్స్ ట్రైన్.. కట్ చేస్తే.. షాకింగ్ వీడియో
ఆ రెస్టారెంట్‌లో రెండో పెళ్లి చేసుకున్నవారికి స్పెషల్ డిస్కౌంట్.. ఎందుకంటే ??
యువతిపై దాడి చేసిన యువకుడి.. నిందితుడి ఇంటిని బుల్‌డోజర్‌తో కూల్చివేత !!
Ram Charan: లాస్ ఏంజిల్స్‌లో చరణ్ అవార్డుతో వస్తాడా ?? లేక ??