Trending Video: వరుడి ముందే వధువుతో ఆ పని చేసిన యువకుడు.. అతని ఎక్స్ప్రెషన్స్ కు ఫిదా అవుతున్న నెటిజన్లు..
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండిపోయే అపురూపమైన వేడుక. కోరుకున్న వ్యక్తితో కడవరకు కలిసి ఉంటామనే భరోసాతో నూతన జీవితంలో అడుగుపెట్టే తరుణం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అందుకే తమ పెళ్లిని...
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండిపోయే అపురూపమైన వేడుక. కోరుకున్న వ్యక్తితో కడవరకు కలిసి ఉంటామనే భరోసాతో నూతన జీవితంలో అడుగుపెట్టే తరుణం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అందుకే తమ పెళ్లిని అందరికంటే భిన్నంగా చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఫొటో షూట్ లు, ప్రి వెడ్డింగ్ షూట్ లు, సంగీత్, బరాత్ లు చాలా పాపులారిటీ సాధించుకున్నాయి. నూతన వధూవరులు కూడా ఈ విధానానికి అలవాటు పడిపోయారు. పెళ్లి వేడుకకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇలాంటి కంటెంట్‌ని నెటిజన్లు ఎంతో ఆసక్తిగా చూడాలని అనుకోవడంలో తప్పులేదు. ప్రస్తుతం, పెళ్లికి సంబంధించిన అలాంటి వీడియో ఒకటి ప్రజల దృష్టిని ఆకర్షించింది.
వైరల్ అవుతున్న వీడియోలో.. జయమాల వేదికపై వధూవరులు కూర్చుండటాన్ని చూడవచ్చు. అక్కడికి ఆకస్మాత్తుగా ఓ యువకుడు వస్తాడు. ఆమెకు కుంకుమ పెట్టే సమయంలో ఏకంగా నుదుటిపై పెట్టేశాడు. ఇది చూసి వరుడు ఆశ్చర్యపోయాడు. అతడు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో చూసిన నెటిజన్లు విపరీతంగా ఆదరిస్తున్నారు. స్క్రిప్ట్ చేసి ఇలా చేశారంటున్నారు. ఏమైనప్పటికీ ఈ వీడియో ప్రజలను కడుపుబ్బా నవ్విస్తోంది.
View this post on Instagram
పెళ్లికి సంబంధించిన ఈ ప్రత్యేకమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ గిడ్డీ ఖాతాలో షేర్ అయింది. ‘నేను, నా స్నేహితురాలి పెళ్లి’ అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. మూడు రోజుల క్రితం అప్‌లోడ్ చేసిన వీడియోను ఇప్పటివరకు 4,500 మందికి పైగా లైక్ చేశారు. అంతే కాకుండా తమకు నచ్చిన విధంగా కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..