Used Cooking Oil Side Effects: వాడిన వంట నూనెనే మళ్లీ మళ్లీ వినియోగిస్తున్నారా? ఇది ఖచ్చితంగా తెలుసుకోండి..

పిండి వంటకాలు, బోండా, వడ, పూరీలు, ఇతర చిరుతుళ్లు అన్నింటినీ వేయించడానికి నూనెను వినియోగించడం తప్పనిసరి. అయితే, ఒకసారి వినియోగించగా మిగిలిన ఆయిల్‌ను

Used Cooking Oil Side Effects: వాడిన వంట నూనెనే మళ్లీ మళ్లీ వినియోగిస్తున్నారా? ఇది ఖచ్చితంగా తెలుసుకోండి..
Cooking Oil
Follow us

|

Updated on: Jan 05, 2023 | 10:12 PM

పిండి వంటకాలు, బోండా, వడ, పూరీలు, ఇతర చిరుతుళ్లు అన్నింటినీ వేయించడానికి నూనెను వినియోగించడం తప్పనిసరి. అయితే, ఒకసారి వినియోగించగా మిగిలిన ఆయిల్‌ను మళ్లీ వినియోగిస్తుంటారు కొందరు. కానీ, అలా వినియోగించడం వల్ల ఆరోగ్యానికి హానీకరం అవుతుంది. అప్పటికే వినియోగించిన నూనెను మళ్లీ కూర, ఇతర వంటకాలు చేసేందుకు వినియోగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.

ఒకసారి ఉపయోగించిన నూనె మళ్లీ మళ్లీ వినియోగించడం వల్ల.. ఆరోగ్యానికి అనేక విధాలుగా హానీ జరుగుతుంది. అంతేకాదు.. తీవ్రమైన వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. మరి ఒకసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ వినియోగించడం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

క్యాన్సర్..

ఒకసారి వాడిని నూనెను, మళ్లీ మళ్లీ వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. వాస్తవానికి నూనెను పదే పదే వేడి చేయడం వల్ల ప్రీరాడికల్స్ దానిలోకి వస్తాయి. తద్వారా దానితో చేసిన వంటకాలు తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. ఆహారంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు నాశనం అవుతాయి. క్యాన్సర్ మూలకాలు పెరుగుతాయి. గాల్ బ్లాడర్ క్యాన్సర్, కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

గుండె జబ్బులు..

పదే పదే వేడి చేసిన నూనెను వినియోగించడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ నూనె వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఉపయోగించిన నూనెను అధిక మంటపై మళ్లీ వేడి చేయడం వల్ల దానిలోని కొవ్వులు ట్రాన్స్ ఫ్యాట్స్‌గా మారుతాయి. ఇవి శరీరానికి చాలా హానికరం.

ఉదర సంబంధిత సమస్యలు..

ఈ నూనె వల్ల ఉదర సంబంధిత సమస్యలు పెరుగుతాయి. అల్సర్, అసిడిటీ, కడుపులో మంట వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అజీర్తి, మలబద్దకం, విరేచనాలు పెరుగుతాయి.

మధుమేహం, స్థూలకాయం..

పదే పదే వేడి చేసిన నూనెను వినియోగించడం వల్ల స్థూలకాయం, మధుమేహం సమస్యలు వస్తాయి. అందుకే ఇలాంటి నూనెను వినియోగించకుండా ఉండాలి.

రక్తపోటు పెరిగే ప్రమాదం..

ఇలాంటి నూనెను వినియోగించడం వల్ల రక్తపోటు సమస్య పెరుగుతుంది. ఫ్రీ ఫ్యాటీ యాసిడ్లు, రాడికల్స్ విడుదలవుతాయి. దీని వల్ల రక్తపోటు సమస్య త్వరగా పెరుగుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..