Earthquake: భారత్‌లో భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు

దేశంలోని పలు ప్రాంతాలతో పాటు అప్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌లలో భూకంపం చోటు చేసుకుంది. దేశంలోని ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి..

Earthquake: భారత్‌లో భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు
Earthquake
Follow us
Subhash Goud

|

Updated on: Jan 06, 2023 | 12:27 AM

దేశంలోని పలు ప్రాంతాలతో పాటు అప్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌లలో భూకంపం చోటు చేసుకుంది. దేశంలోని ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌, ఘజియాబాద్‌, పంజాబ్‌, గురుగ్రామ్‌, నోయిడాల్లో ఈ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.9గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. అయితే ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్‌లోనూ ఈ భూకంపం చోటు చేసుకుంది. అప్ఘనిస్థాన్‌లోని ఫైజాబాద్‌కు దక్షిణాన 79 కిమీ దూరంలో భూకంపం సంభవించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే దీని ప్రభావం పాకిస్థాన్ నుంచి భారత్ వరకు కనిపించింది. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో భూమి కంపించింది.

అప్ఘన్‌లోని హిందూ ఖుష్‌ పర్వత ప్రాంతాల్లో భూమికి 200 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఇవి కూడా చదవండి

అయితే దేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపం చోటు చేసుకున్నప్పటికీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని తెలుస్తోంది. ఢిల్లీ వాసులు భూకంపం కారణంగా తమకు ఎదురైన అనుభవాలను ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా నెటిజెన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు.

అయితే భూకంపం వచ్చిన సమయంలో పలు శబ్దాలు కూడా వచ్చినట్లు పలువురు చెబుతున్నారు. భూమి కంపించడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని, వెంటనే తమ తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశామని చెబుతున్నారు. మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!