Cars Discontinued: ఇక ఏప్రిల్ నుంచి ఈ కార్లు కనిపించవు.. కారణం ఇదేనా..?
పర్యావరణం దెబ్బతింటున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కార్బన్ ఉద్గారాలను మరింతగా నియంత్రించేందుకు కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది..
పర్యావరణం దెబ్బతింటున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కార్బన్ ఉద్గారాలను మరింతగా నియంత్రించేందుకు కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ (ఆర్టీఈ) రూల్స్‌ను అమలు చేయనుంది. దీంతో దేశీయ మార్కెట్ నుంచి పలు కార్లు, ఎస్‌యూవీలు కనుమరుగు కానున్నాయి. స్పీడ్, యాక్సిలరేషన్, డిసిలరేషన్‌లో తరుచుగా మార్పులు రావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకసారి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే కార్ల తయారీ దారులు తమ కార్ల నుంచి ఉద్గారాలను తగ్గించడానికి వాటి ఇంజిన్లను అప్‌గ్రేడ్ చేయాలి. ప్రత్యేకించి డీజిల్ వినియోగ ఇంజిన్ల అప్‌గ్రెడేషన్ ఖర్చుతో కూడుకుంది. దీంతో 27 కార్లు, ఎస్‌యూవీలు దేశీయ మార్కెట్లో కనుమరుగు కానున్నాయి.
ఆర్డీఈ నిబంధనల ప్రకారం.. కార్లలో ఆన్‌బోర్డ్ సెల్ఫ్-డయాగ్నోస్టిక్ డివైజ్ ఉండాల్సిందే. ఇది రియల్ టైం డ్రైవింగ్ ఎమిషన్ లెవెల్స్‌ను నిర్ధారిస్తుంది. ఆన్‌బోర్డు సెల్ఫ్ డయాగ్నొస్టిక్ డివైజ్ అనునిత్యం క్యాటలిక్ కన్వర్టర్, ఆక్సిజన్ సెన్సర్‌లు ఉద్గారాల నియంత్రణ ప్రమాణాలను అందుకుంటుందా? అని పర్యవేక్షిస్తుంది. అలాగే కార్ల తయారుదారులు సెమీ కండక్టర్లను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇంధనం మండిపోకుండా నియంత్రించడానికి కార్లు, ఎస్‌యూవీల్లో ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్టర్లను ఏర్పాటు చేయాలి.
కనుమరుగయ్యే కార్లు ఇవే..
- రెనాల్ట్ క్విడ్ 800
- నిసాన్ కిక్స్
- మారుతి సుజుకి ఆల్టో 800.
- హోండాలోని సిటీ ఫోర్త్ జెన్, సిటీ ఫిఫ్త్ జెన్ (డీజిల్), అమేజ్ (డీజిల్), జాజ్, డబ్ల్యూఆర్-వీ.
- మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన మర్రాజో, అల్టూరస్ జీ4, కేయూవీ 100.
- హ్యుండాయ్ మోటార్స్‌లోని ఐ20, వెర్నా డీజిల్ మోడల్స్.
- స్కోడాకు చెందిన ఒక్టావియా, సూపర్బ్
- టాటా ఆల్ట్రోజ్ (డీజిల్)
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి