AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PMJDY: మీకు ఆ అకౌంట్‌ ఉందా..? ఖాతాలో డబ్బులు లేకున్నా రూ.10 వేలు తీసుకోవచ్చు.. మోడీ సర్కార్‌ అద్భుతమైన స్కీమ్‌

దేశ ప్రజల కోసం మోడీ ప్రభుత్వం ఎన్నో స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఆర్థికంగా ఎదిగేందుకు మోడీ సర్కార్‌ వివిధ రకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక మోడీ..

PMJDY: మీకు ఆ అకౌంట్‌ ఉందా..? ఖాతాలో డబ్బులు లేకున్నా రూ.10 వేలు తీసుకోవచ్చు.. మోడీ సర్కార్‌ అద్భుతమైన స్కీమ్‌
Pmjdy
Subhash Goud
|

Updated on: Jan 04, 2023 | 6:01 AM

Share

దేశ ప్రజల కోసం మోడీ ప్రభుత్వం ఎన్నో స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఆర్థికంగా ఎదిగేందుకు మోడీ సర్కార్‌ వివిధ రకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన పథకం ఒకటి. దీనిని ప్రధాని నరేంద్ర మోడీ 2014 ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించగా, ఆగస్టు 28 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకం కింద లబ్దిదారులు పోస్టాఫీసులు, ప్రభుత్వ, పైవేట్‌ బ్యాంకులలో జీరో బ్యాలెన్స్‌ అకౌంట్లు ఓపెన్ చేయవచ్చు. ఈ ఖాతాలో మినిమమ్‌ బ్యాలెన్స్‌ మెయింటెన్‌ చేయవలసిన అవసరం లేదు. అంతేకాదు జన్‌ ధన్‌ యోజన ఖాతాలను ప్రభుత్వ పథకాలకు లింక్‌ చేసి లబ్ధిదారులకు నేరుగా నగదు జమ చేస్తున్నారు.

రూ.10 వేల వరకు విత్‌డ్రా

అలాగే ఈ ఖాతా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో బ్యాలెన్స్ లేకపోయినా మీరు ఖాతా నుంచి రూ.10,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది కాకుండా రూపే డెబిట్ కార్డ్ సౌకర్యం కల్పిస్తారు. ఈ డెబిట్‌ కార్డుద్వారా మీరు ఖాతా నుంచి డబ్బు తీసుకోవచ్చు. కొనుగోళ్లు కూడా నిర్వహించవచ్చు. ఈ జన్ ధన్ యోజన కింద10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై కూడా ఖాతాను తెరవవచ్చు.

రూ.2 లక్షల ప్రమాద బీమా

ఈ పథకం కింద ఖాతా తెరిచినప్పుడు మీరు రూపే ATM కార్డ్, రూ.2 లక్షల ప్రమాద బీమా, రూ.30 వేల జీవిత బీమా, డిపాజిట్ మొత్తంపై వడ్డీ పొందుతారు. మీరు దీనిపై 10 వేల ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కూడా పొందుతారు. ఈ ఖాతాను ఏ బ్యాంకులోనైనా తెరవవచ్చు. జన్ ధన్ ఖాతాను తెరవడానికి మీరు ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్‌ ఏదో ఒకటి ఉండాలి. మీకు ఈ పత్రాలు లేకపోతే మీరు చిన్న ఖాతాను కూడా ఓపెన్ చేసే సౌకర్యం ఉంది. ఇందులో మీరు బ్యాంకు అధికారి ముందు ఒక ఫోటో, ఫారమ్‌ నింపి సంతకం చేసి ఇవ్వాల్సి ఉంటుంది. జన్ ధన్ ఖాతాను తెరవడానికి మీరు ఎలాంటి రుసుము లేదా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఈ ఖాతాను తెరవవచ్చు. ఓవర్‌ డ్రాప్ట్‌ సదుపాయం గతంలో రూ.5000 ఉండగా, దానిని కేంద్ర ప్రభుత్వం రూ.10,000 పెంచింది. భారతదేశంలో నివసించే పౌరులు ఎవరైనా ఈ ఖాతాను తెరవవచ్చు.ఈ ఖాతాలో ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కోసం గరిష్ట వయోపరిమితి 65 సంవత్సరాలు. ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని పొందడానికి, మీ జన్ ధన్ ఖాతా తెరిచి కనీసం 6 నెలలై ఉండాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ