Indian Railways: రైలు టికెట్‌ తీసుకోవడం మరింత సులభం.. ఫోన్‌లోనే టికెట్స్‌

రైలులో ప్రయాణించేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. అయితే జనరల్‌ బోగీల్లో రైలు ప్రయాణం చేయడానికి ముందు రైలు..

Indian Railways: రైలు టికెట్‌ తీసుకోవడం మరింత సులభం.. ఫోన్‌లోనే టికెట్స్‌
Indian Railways
Follow us
Subhash Goud

|

Updated on: Jan 03, 2023 | 8:15 AM

రైలులో ప్రయాణించేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. అయితే జనరల్‌ బోగీల్లో రైలు ప్రయాణం చేయడానికి ముందు రైలు టికెట్స్‌ ఇస్తారు. ఒక్కోసారి టికెట్ బుకింగ్ సెంటర్‌ వద్ద జనాలు భారీగా ఉండటం వల్ల టికెట్‌ తీసుకోవడం కొంత కష్టంగా ఉంటుంది. సమయానికి టికెట్‌ దొరక్క రైలు కూడా మిస్సవుతుంటుంది. కానీ టెక్నాలజీ పెరిగిపోయిన కారణంగా అన్ని పనులు స్మార్ట్‌ఫోన్‌లోనే చేసుకోవచ్చు. ప్రతి రోజు రైలు ప్రయాణం చేసేవారికి ఇండియన్‌ రైల్వే అన్ రిజ‌ర్వుడ్ టికెట్ బుకింగ్ సిస్టమ్‌ (యూటీఎస్‌) యాప్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీని ద్వారా జనరల్‌ టికెట్లను సులభంగా తీసుకోవచ్చు.

స్మార్ట్ ఫోన్ యూజ‌ర్లు త‌మ ఫోన్‌లో గూగుల్ ప్లేస్టోర్ ద్వారా యూటీఎస్ యాప్ ఇన్‌స్టల్ చేసుకుంటే సరిపోతుంది. మీ ఫోన్‌లోని జీపీఎస్ ఆధారంగా ఈ యూటీఎస్‌ యాప్ ప‌ని చేస్తుంది. ఇప్పటి వ‌ర‌కు నిర్ణీత దూరంలో ఉంటేనే ఈ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవ‌చ్చు. స‌బ‌ర్బన్ ప్రాంతాల వారు త‌మ ప‌రిధిలోని రైల్వే స్టేష‌న్‌కు ఇప్పటివ‌ర‌కు రెండు కి.మీ. దూరంలో ఉంటే.. తాము వెళ్లే రైల్వే స్టేష‌న్‌కు ఈయాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు దానిని ఐదు కిలోమీటర్ల దూరానికి పెంచేసింది రైల్వే శాఖ.

ఇక ఇతర ప్రాంతాలలో 20 కిలోమీటర్ల నుంచి కూడా టికెట్‌ బుకింగ్‌ చేసుకునేందుకు రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో స‌బ‌ర్బన్ ప్రాంతాల్లో గ‌రిష్టంగా 10 కిలోమీటర్ల దూరం నుంచి టికెట్ బుకింగ్‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అనుమతి ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

టికెట్‌ బుక్‌ చేసుకోవడం ఎలా?

జ‌న‌ర‌ల్ బోగీ టికెట్ల కోసం యాప్‌లోని సాధారణ బుకింగ్ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు ప్రయాణిస్తున్న రైల్వే స్టేషన్‌, దాని కోడ్‌, మీరు చేసుకోవాల్సిన రైల్వే స్టేషన్‌ లేదా కోడ్‌, ప్రయాణికుల సంఖ్య, అందులో ప్యాసింజర్‌, లేదా ఎక్స్‌ప్రెస్‌ రైలు వంటి ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అలాగే ప్లాట్‌ఫామ్ టికెట్ ఆప్షన్‌లోకి వెళ్లి రైల్వే స్టేష‌న్ నంబ‌ర్‌, టికెట్ల సంఖ్య న‌మోదు చేయాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాలేజ్ గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా !!
కాలేజ్ గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా !!
పాపం.. అడవి నుంచి నీళ్ల కోసం అని వస్తే.. గుండె తరుక్కుపోయే దృశ్యం
పాపం.. అడవి నుంచి నీళ్ల కోసం అని వస్తే.. గుండె తరుక్కుపోయే దృశ్యం
పవన్‌ను తల్చుకుంటూ గాల్లో తేలిపోతున్న రచ్చ రవి.. ఏమైందంటే?
పవన్‌ను తల్చుకుంటూ గాల్లో తేలిపోతున్న రచ్చ రవి.. ఏమైందంటే?
బెల్లం,లవంగాలు కలిపి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?100 రోగాలకు చెక్
బెల్లం,లవంగాలు కలిపి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?100 రోగాలకు చెక్
పాలతో మఖానా కలిపి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలిస్తే వదిలిపెట్టరు !!
పాలతో మఖానా కలిపి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలిస్తే వదిలిపెట్టరు !!
క‌థ‌ రెడీ.. నిర్మాత రెడీ.. హీరోనే కరువు.. ఎవరా దర్శకులు.?
క‌థ‌ రెడీ.. నిర్మాత రెడీ.. హీరోనే కరువు.. ఎవరా దర్శకులు.?
దేశంలోనే అతి పెద్ద ఐపీవోకు రంగం సిద్దం..!
దేశంలోనే అతి పెద్ద ఐపీవోకు రంగం సిద్దం..!
ప్రొటీన్‌ ఆహారం తీసుకుంటే నీళ్లు ఎక్కువగా తాగాలా ??
ప్రొటీన్‌ ఆహారం తీసుకుంటే నీళ్లు ఎక్కువగా తాగాలా ??
చలికాలంలో వెచ్చగా ఉండే ఎలక్ట్రిక్‌ దుప్పట్లు.. తక్కువ ధరల్లో..!
చలికాలంలో వెచ్చగా ఉండే ఎలక్ట్రిక్‌ దుప్పట్లు.. తక్కువ ధరల్లో..!
ఆడ తోడు కోసం వెదుకుతున్న పులి.. ఇలా దొరికిపోయింది..
ఆడ తోడు కోసం వెదుకుతున్న పులి.. ఇలా దొరికిపోయింది..