UPI Limit: ఈ యూపీఐ యాప్స్ నుంచి రోజుకు ఎంత డబ్బు పంపుకోవచ్చో తెలుసా? తెలియకపోతే ఓ లుక్కెయ్యండి
ఎన్ని యూపీఐ యాప్స్ ఉన్నా కేవలం నాలుగు యాప్స్ ద్వారానే వినియోగదారులు డబ్బును ఎక్కువగా పంపుతున్నారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్, అమెజాన్ పే యాప్స్ నే వినియోగదారులు ఎక్కువగా వాడుతున్నారు. అయితే మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? యూపీఐ యాప్స్ ద్వారా రోజుకు ఎంత డబ్బు పంపగలమో? తెలియకపోతే ఓ సారి తెలుసుకుందాం.
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) అనేది ప్రస్తుతం భారతదేశంలో ఇతరులకు డబ్బు పంపేందుకు ఎక్కువ వాడే పద్ధతి యూపీఐ రాకతో నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి బ్యాంకింగ్ సేవలు పూర్తిగా పడిపోయాయి. జేబులో పర్స్ పెట్టుకోవడం మర్చిపోయినా స్మార్ట్ ఫోన్ తో ఈజీగా కొనుగోలు చేసేందుకు అనువుగా ఉండడంతో అందరూ యూపీఐ పేమెంట్స్ చేసేందుకే ఇష్టపడుతున్నారు. విక్రేతలు కూడా వారి వారి వ్యాపార అవసరాలను డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసి ఇతరులకు పంపే బాధ తప్పడంతో యూపీఐ లావాదేవీలు చేసేందుకు కస్టమర్లను ప్రోత్సహిస్తున్నారు. ఎన్ని యూపీఐ యాప్స్ ఉన్నా కేవలం నాలుగు యాప్స్ ద్వారానే వినియోగదారులు డబ్బును ఎక్కువగా పంపుతున్నారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్, అమెజాన్ పే యాప్స్ నే వినియోగదారులు ఎక్కువగా వాడుతున్నారు. అయితే మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? యూపీఐ యాప్స్ ద్వారా రోజుకు ఎంత డబ్బు పంపగలమో? తెలియకపోతే ఓ సారి తెలుసుకుందాం.
యూపీఐ ను డెవలప్ చేసిన ఎన్ పీసీఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఒక వినియోగదారుడు గరిష్టంగా ఒకరోజు యూపీఐ లో కేవలం రూ.లక్ష మాత్రమే పంపగలడు. యూపీఐ ద్వారా బదిలీ చేసే డబ్బు మీ బ్యాంక్, అలాగే మీరు వాడే యాప్ పై ఆధారపడి ఉంటుంది. 24 గంటల్లో రూ.లక్ష కంటే ఎక్కువ మొత్తం ట్రాన్స్ ఫర్ చేయడానికి ఏ బ్యాంకు ఒప్పుకోదు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే యాప్స్ లావాదేవీల పరిమితి ఎంత ఉందో తెలుసుకుందాం.
గూగుల్ పే
ఈ యాప్ లో మీరు రోజుకు గరిష్టంగా రూ. లక్ష కంటే ఎక్కువ పంపలేరు. అలాగే రోజుకు 10 మందికి మించి డబ్బును పంపలేరు.అంటే మీరు రోజు రూ.లక్ష లోపు 10 మందికి మాత్రమే డబ్బును పంపే అవకాశం ఉంది.
పేటీఎం
ఎన్ పీసీఐ నిబంధనల ప్రకారం పేటీఎం ద్వారా కూడా రోజుకు రూ. లక్ష మాత్రమే పంపగలం. అయితే రోజుకు ఎంతమందికైనా రూ.లక్ష లోపు మాత్రమే పంపుకునేందుకు అనుమతి ఉంది.
ఫోన్ పే
ఫోన్ పేలో కూడా రోజుకు రూ.లక్ష మాత్రమే పంపగలం. అలాగే రోజుకు 10 మందికి మాత్రమే లావాదేవీలు జరుపుకునేందుకు ఛాన్స్ ఉంది.
అమెజాన్ పే
అమెజాన్ పే యాప్ ద్వారా కూడా రోజుకు రూ.లక్ష మాత్రమే పంపగలం. అయితే రోజుకు 20 మంది కి మనం రూ.లక్షలోపు ఎంతైనా పంపే అవకాశం ఉంది. అయితే అమెజాన్ పే యూపీఐ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మొదటి 24 గంటల లోపు కేవలం రూ. 5000 మాత్రమే పంపగలమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..