AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kurnool District: నడిరోడ్డుపై క్షుద్రపూజలు.. యువకుడు చేసిన పనితో అందరూ షాక్‌

కరోనా కల్లోలం ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నాం. ఈ స్థాయి మహమ్మారి వైరస్‌ కోసం వ్యాక్సిన్ తయారుచేశాం. కానీ ప్రజల నుంచి మూఢనమ్మకాలను దూరం చేయలేకపోతున్నాం.

Kurnool District: నడిరోడ్డుపై క్షుద్రపూజలు.. యువకుడు చేసిన పనితో అందరూ షాక్‌
Black Magic
Ram Naramaneni
|

Updated on: Jan 05, 2022 | 6:33 PM

Share

కరోనా కల్లోలం ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నాం. ఈ స్థాయి మహమ్మారి వైరస్‌ కోసం వ్యాక్సిన్ తయారుచేశాం. కానీ ప్రజల నుంచి మూఢనమ్మకాలను దూరం చేయలేకపోతున్నాం. తాజాగా కర్నూలు జిల్లాలో నడిరోడ్డుపై క్షుద్రపూజలు కలకలం రేపాయి. కోడిగుడ్లు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, చిల్లర నాణేలు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు భయానక పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. అది చూసిన స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. కానీ, ఓ యువకుడు మాత్రం డేరింగ్ స్టెప్ వేశాడు. అతడు చేసిన పనితో అంతా షాక్‌ అయ్యారు. ఇదేంటని ముక్కున వేలేసుకుంటున్నారు.

మూఢనమ్మకాలను నమ్మొద్దంటూ ప్రచారం చేస్తున్నాడు కర్నూలు జిల్లా ఆస్పరికి చెందిన నాగన్న. రామతీర్థంకు వెళ్లే దారిలో కొందరు పసుపు, కుంకుమ, పువ్వులు, కోడిగుడ్డు, అరటి పండు, అగరుబత్తీలు ఉంచారు. దీంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. అయితే నాగన్న వాటిని తొలగించి.. నీటితో శుభ్రం చేసిన అనంతరం అక్కడ ఉంచిన కోడిగుడ్డు, అరటి పండు, నిమ్మకాయను ఇంటికి తీసుకెళ్లారు. ప్రజలు ఇలాంటి నమ్మొద్దంటూ అవగాహన కల్పిస్తున్నాడు. అయితే ఇలాంటి పూజలు చేసిన ఆనవాళ్లు ఉంటేనే అటువైపు వెళ్లకుండా ఉంటారు జనాలు. కానీ ఈ వ్యక్తి తెగింపు మాత్రం స్థానిక ప్రజలను ఆశ్చర్యపరిచింది.

Also Read:  సడెన్ ట్విస్ట్.. ఆర్జీవీకి మంత్రి పేర్ని నాని అపాయింట్‌మెంట్..

 ‘నాకు నేచురల్ స్టార్ నాని మాత్రమే తెలుసు.. కొడాలి నాని ఎవరో తెలీదు..’ వర్మ టీజింగ్

Follow Us
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ వలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ వలవడం..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది