Telangana: వెయ్యికి.. 10 వేలు, లక్షకి.. ఐదు లక్షలు.. నిట్టనిలువునా మోసపోయిన 200 మంది
వికారాబాద్ జిల్లాలో భారీ సైబర్ మోసం బయటపడింది. లైమ్ కంపెనీ పేరుతో ఉన్న లింక్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న 200 మంది బొక్కబోర్లాపడ్డారు.
వికారాబాద్ జిల్లాలో భారీ సైబర్ మోసం బయటపడింది. లైమ్ కంపెనీ పేరుతో ఉన్న లింక్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న 200 మంది బొక్కబోర్లాపడ్డారు. మాయ చేయడం కోసం మొదటి రోజు భారీగా ఆదాయం వచ్చేలా చేశారు. దీంతో వారు తమకు తెలిసినవాళ్లకు ఈ విషయం చెప్పారు. అందరూ కలిసి లక్షలు గుమ్మరించేశారు. తర్వాత యాప్ పనిచేయకపోవటంతో.. లబోదిబోమంటూ.. పోలీసులను ఆశ్రయించారు. వికారాబాద్ జిల్లాలోని పూడూర్ మండలం కడుమూర్‌లో వెలుగుచూసింది ఈ భారీ మోసం.
వెయ్యికి పది వేలు, లక్షకి ఐదు లక్షలు వస్తాయనడంతో అత్యాశకు పోయిన స్థానిక యువకులు, గ్రామస్తులు యాప్‌లో డబ్బులు పెట్టుబడి పెట్టి మోసపోయారు. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులకు లైమ్ కంపెనీ పేరుతో ఓ లింక్ వచ్చింది. ఇద్దరూ షేర్ చేసుకుని మరీ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఐదింతలు, పదింతలు లాభాలు వస్తాయనడంతో అప్పులు చేసి మరీ లక్షల్లో పెట్టుబడి పెట్టారు. భారీ ఆఫర్ పేరుతో సీమ అనే కిలాడీ లేడీ లైన్‌లోకి వచ్చింది. వారితో వాట్సాప్ చాట్ చేసి లక్షకి 5 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పడంతో నమ్మేశారు. వారితో పాటు మరో 200 మంది ఈ యాప్‌లో డబ్బులు పెట్టారు. దాదాపు కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత చూస్తే నయాపైసా రాలేదు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలాగైనా తమ డబ్బులు తిరిగి వచ్చేలా చూడాలని కోరుతున్నారు.
Also Read: నడిరోడ్డుపై క్షుద్రపూజలు.. యువకుడు చేసిన పనితో అందరూ షాక్
సడెన్ ట్విస్ట్.. ఆర్జీవీకి మంత్రి పేర్ని నాని అపాయింట్‌మెంట్..