Shocking: అనుమానాస్పదంగా కనిపించిన పార్శిల్ బాక్స్‌లు.. తెరిచి చూసిన అధికారులు షాక్
ఎయిర్‌పోర్టులలో విసృత తనిఖీలు చేస్తున్నప్పటికీ స్మగర్లు దారికి రావడం లేదు. ఏదో ఒక మార్గంలో స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఎయిర్‌పోర్టులలో విసృత తనిఖీలు చేస్తున్నప్పటికీ స్మగర్లు దారికి రావడం లేదు. ఏదో ఒక మార్గంలో స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. స్మగ్లర్లు ఎన్నుకుంటున్న మార్గాలు చూసి పోలీసులు, కస్టమ్స్ అధికారులు షాక్‌కు గురవుతున్నారు. తాజాగా దేవాలయాల్లోను, అడవుల్లోనూ ఉండాల్సిన అరుదైన నక్షత్ర తాబేళ్లను దేశాలు దాటించే ప్రయత్నం చేస్తున్నారు కేటుగాళ్లు. గడచిన కొద్ది సంవత్సరాలుగా నక్షత్ర జాతి సంపద ఆనవాళ్లను కోల్పోతోంది. అంతరించి పోతున్న వన్యప్రాణుల లిస్ట్‌లోకి చేరింది. వాటి విలువ గుర్తించిన స్మగ్లర్లు మాత్రం అడవులను జల్లెడ పడుతూ కనిపించిన నక్షత తాబేళ్లను బాక్సుల్లో బంధించేస్తున్నారు. అరుదైన వన్య సంపదను దేశాలు దాటించేసి.. ప్రతి ఫలంగా లక్షలాది రూపాయలను కూడగట్టుకుంటున్నారు. తాజాగా చెన్నై ఎయిర్ కార్గో కస్టమ్స్ అధికారులు 1364 నక్షత్ర తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై విమానాశ్రయానికి సమీపంలోని మీనంబాక్కంలో ఉన్న ఎయిర్ కార్గో ఎక్స్‌పోర్ట్ షెడ్‌లో వన్యప్రాణులను కలిగి ఉన్నట్లు సమాచారం రావడంతో అధికారులు దాడులు చేశారు. వాటిని మలేషియాకు తరలించే ఏర్పాట్లు చేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. దీనిపై అంతరించిపోతున్న జాతుల వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న తాబేళ్లను తమిళనాడు రాష్ట్ర అటవీ శాఖకు అప్పగించారు.
వాస్తవానికి వన్యప్రాణుల్లో తాబేలుకు జీవితకాలం చాలా ఎక్కువ. దీన్ని ఇంట్లో పెంచుకుంటే ఆయుష్షు పెరుగుతుందని అపన్మకాలు క్రియేట్ చేసి.. సొమ్ము చేసుకుంటున్నారు కేటుగాళ్లు. ఈ నక్షత్ర తాబేళ్లకు చైనా, థాయ్‌ల్యాండ్‌ల్లో బాగా డిమాండ్ ఉంది. బంధువుల, సన్నిహితుల ఇంటికి వచ్చినా, వాళ్ల ఇంటికి వెళ్లినా, ఇతర శుభకార్యాలకు వెళ్లినా నక్షత్ర తాబేలును గిఫ్ట్‌గా ఇస్తారు. ఈ సెంటిమెంట్‌ను గుర్తించిన అక్రమార్కులు ఈ తాబేళ్లను దొడ్డిదారిన అమ్మేసి సొమ్ముచేసుకుంటున్నారు.
Also Read: హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న గాలి జనార్దన్ రెడ్డి కొడుకు.. దర్శకుడు ఎవరంటే..