AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV- Perni Nani: సడెన్ ట్విస్ట్.. ఆర్జీవీకి మంత్రి పేర్ని నాని అపాయింట్‌మెంట్..

విషయం ఏదైనా సరే.. తనదైన లాజిక్‌తో.. ఇతడి వెర్షన్ కరెక్ట్ కదా అని అనిపించుకుంటారు వర్మ. లా పాయింట్లతో సహా ప్రశ్నలు సంధిస్తారు.

RGV- Perni Nani: సడెన్ ట్విస్ట్.. ఆర్జీవీకి మంత్రి పేర్ని నాని అపాయింట్‌మెంట్..
Perni Nani Rgv
Ram Naramaneni
|

Updated on: Jan 05, 2022 | 5:55 PM

Share

విషయం ఏదైనా సరే.. తనదైన లాజిక్‌తో.. ఇతడి వెర్షన్ కరెక్ట్ కదా అని అనిపించుకుంటారు వర్మ. లా పాయింట్లతో సహా ప్రశ్నలు సంధిస్తారు. తాజాగా ఏపీలో సినిమా టికెట్ రేట్లు వ్యవహారంలోనూ ఇదే పంథాలో ముందుకెళ్లారు. టీవీ డిబేట్ల నుంచి మొదలైన రచ్చ ట్విట్టర్‌లో అగ్గి రాజేసింది. గారూ అంటూ సంభోదిస్తునే.. ఏపీ మంత్రులకు ఘాటు ప్రశ్నలు సంధించారు వర్మ. ఇక అటు ఏపీ మినిస్టర్స్ సైడ్ నుంచి కూడా అదే రేంజ్‌లో రిప్లై వచ్చింది.

అయితే రెండు రోజులుగా ట్విట్టర్‌లో వార్ కొనసాగించిన వర్మ.. తన స్టైల్‌కు భిన్నంగా డిబేట్‌కు ఎండ్ కార్డ్ వేశారు. ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవాలి అన్నది తన ఉద్దేశం కాదని పేర్కొన్నారు. పర్సనల్ గా వై.ఎస్.జగన్ అంటే తనకు చాలా అభిమానమని.. కేవలం మా సమస్యలు  సరిగా చెప్పుకోలేక పోవడం వల్లో లేక, ప్రభుత్వం తమ కోణం నుంచి అర్థం చేసుకోకపోవడం వల్లో ఈ మిస్ అండర్ స్టాండింగ్ ఏర్పడిందని రాసుకొచ్చారు. అనుమతిస్తే మంత్రిని కలిసి మా తరపు నుంచి  సమస్యలకి సంభందించిన వివరణ ఇస్తానని స్పష్టం చేశారు. అది విన్న తర్వాత ప్రభుత్వ పరంగా ఆలోచించి సరైన పరిష్కారం ఇస్తారని ఆశిస్తున్నాను అని వర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

అయితే వర్మ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించారు మంత్రి పేర్ని నాని. తప్పకుండా త్వరలోనే కలుద్దాం అంటూ ఆర్జీవీ ట్వీట్‌కు సమాధానమిచ్చారు.

సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని నుండి సానుకూలస్పందన వచ్చినందున ఈ అనవసర వివాదానికి ముగింపు పలకాలనుకుంటున్నట్లు ఆర్జీవీ స్పష్టం చేశారు. దీంతో 2 రోజులుగా జరిగిన ట్విట్టర్‌ వార్‌కు బ్రేక్ పడినట్లే అనిపిస్తుంది. కాగా వర్మ ఈనెల 8వ తేదీ వరకు షూటింగ్స్‌లో బిజీగా ఉన్నందున.. 9 లేదా 10వ తేదీల్లో పేర్ని నానితో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 

Also Read:  ‘నాకు నేచురల్ స్టార్ నాని మాత్రమే తెలుసు.. కొడాలి నాని ఎవరో తెలీదు..’ వర్మ టీజింగ్