Balakrishna: చిరంజీవితో గొడవలు ఉన్నాయా..? అన్ స్టాపబుల్‌లో క్లారిటి ఇచ్చిన బాలయ్య.

నందమూరి నట సింహం బాలకృష్ణ అటు హీరోగా అలరిస్తూనే మరో వైపు హోస్ట్ గా అదరగొడుతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం బాలయ్య హోస్ట్ గా మారిన విషయం తెలిసిందే.

Balakrishna: చిరంజీవితో గొడవలు ఉన్నాయా..? అన్ స్టాపబుల్‌లో క్లారిటి ఇచ్చిన బాలయ్య.
Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 05, 2022 | 6:34 PM

Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ అటు హీరోగా అలరిస్తూనే మరో వైపు హోస్ట్ గా అదరగొడుతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం బాలయ్య హోస్ట్ గా మారిన విషయం తెలిసిందే. బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ అనే ప్రోగ్రాం స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే ఈ షో భారీ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ఈ షోకు మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అనీల్ రావిపూడి, పుష్ప టీమ్, రవితేజ, గోపీచంద్ మలినేని, రానా హాజరయ్యి సందడి చేశారు. అలాగే  ఈ షోకు సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరయ్యారు. మహేష్ ఎపిసోడ్ ను త్వరలోనే టెలికాస్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే రవితేజ గెస్ట్ గా వచ్చిన సమయంలో రవితేజకు, బాలకృష్ణ కు పెద్ద గొడవ అయ్యిందని.. ఇద్దరు మాట్లాడుకోవడం లేదని ఎదో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయని బాలయ్య రవితేజను అడగ్గా.. పనిపాట లేని డ్యాష్ నా డ్యాష్ గాళ్ళకు ఇదే పని అంటూ నవ్వేశారు. తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ పై బాలయ్య స్పందిస్తూ..

” ఇవాళ ప్రపంచంలో ప్రతివాడు సోషల్ మీడియాలో ఏం అనాలనిపిస్తే అది అంటున్నాడు. పేరు తెలియదు .. లొకేషన్ తెలియదు .. అడ్రెస్ ఉండదు. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. బాలకృష్ణకి రవితేజకి పడదు.. చిరంజీవి బాలకృష్ణ ఫోన్లో మాట్లాడుకోరు .. నా హీరో తోపు .. నీ హీరో సోపు .. లెఫ్ట్ హ్యాండ్ కూడా రెడీ అయిందీ .. దొరికితే దవడ పగిలిపోద్దీ. అని వార్నింగ్ ఇచ్చారు. అలాగే  కానీ మనం చేయవలసింది ఒక్కటే .. ఊరు .. పేరు చెప్పుకోవడానికి ధైర్యంలేని ఈ వెధవలను క్షమిద్దాం. మన మీద వచ్చిన విమర్శలను ప్రేమించినప్పుడే మనం ‘అన్ స్టాపబుల్’ అవుతాం” అంటూ చెప్పుకొచ్చారు బాలయ్య.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: చిరునవ్వులతో ముద్దులొలికే ఈ చిన్నారి వరుస హిట్స్‌తో దూసుకుపోతోంది.. ఎవరో గుర్తుపట్టారా.!

Megastar Chiranjeevi: సేనాపతిపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. రాజేంద్రప్రసాద్ నటనపై ఆసక్తికర కామెంట్స్..

Pushpa: ఇట్స్ అఫీషియల్.. అమెజాన్ ప్రైమ్‏లో పుష్ప.. స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన మేకర్స్..