Fitness Goals: బీ కేర్ ఫుల్ బ్రో.. సిక్స్ ప్యాక్ కోసం వాటి జోలికెళ్తే అంతే సంగతులు

ఫిట్‌నెస్‌ ప్రతీ ఒక్కరికి చాలా అవసరం. రోజంతా యాక్టివ్‌గా ఉండాలనుకోవడం, కండలు పెంచాలనుకోవడం తప్పు కాదు.. ఇందు కోసం ఫిట్‌నెస్‌ మంత్రను అనుసరించడంలో తప్పు లేదు..

Fitness Goals: బీ కేర్ ఫుల్ బ్రో.. సిక్స్ ప్యాక్ కోసం వాటి జోలికెళ్తే అంతే సంగతులు
Six Pack
Follow us

|

Updated on: Jan 05, 2022 | 5:06 PM

ఫిట్‌నెస్‌(Fitness) ప్రతీ ఒక్కరికి చాలా అవసరం. రోజంతా యాక్టివ్‌గా ఉండాలనుకోవడం, కండలు పెంచాలనుకోవడం తప్పు కాదు.. ఇందు కోసం ఫిట్‌నెస్‌ మంత్రను అనుసరించడంలో తప్పు లేదు.. అవసరమనుకుంటే జిమ్‌లో కాస్త ఎక్కువగా వర్కౌట్స్ చేసినా ఫర్వాలేదు. అయితే ఈ క్రేజ్ గుడ్డిగా పీక్స్‌కు చేరితే మాత్రం కథ మరోలా ఉంటుంది. వ్యాయమం ఆరోగ్యానికి మంచిదే కానీ.. అతి వ్యాయామం కొన్ని సార్లు ప్రాణాలకే ముప్పుగా పరిణమిస్తుంది. ఇది నిజమని చెప్పే నిదర్శనాలు ఎన్నెన్నో ఉన్నాయి. పెద్ద సెలబ్రిటీలు కూడా తమ ప్రాణాలనే కోల్పోయారు.

నేరుగా విషయానికొస్తే.. ఫిట్‌నెస్‌ మంత్ర ముసుగులో డ్రగ్‌ దందా నడుస్తోంది. యూత్‌లో సిక్స్‌ ప్యాక్‌ క్రేజ్‌ను మెడికల్‌ మాఫియా క్యాష్‌ చేసుకుంటోంది. ఫిట్‌నెస్ కోసం జిమ్‌కు వెళ్లే అమాయక యువతను కొందరు కేటుగాళ్లు టార్గెట్‌ చేస్తున్నారు. వారి హెల్త్‌తో పాటు లైఫ్‌ను రిస్క్‌లో పడేస్తూ.. తమ ప్యాకెట్స్ నింపుకుంటున్నారు. సిక్స్‌ ప్యాక్‌‌పై మోజుతో కొందరు యువకులు స్టెరాయిడ్స్‌(Steroids)కు బానిసలవుతున్నారు. డ్రగ్‌ మాఫియా నిషేధిత స్టెరాయిడ్స్‌ను సప్లయ్‌ చేస్తూ సొమ్ము చేసుకుంటోంది. మెఫిన్‌ టెర్మైన్‌ సల్ఫేట్‌ ఇంజక్షన్లు హాస్పిటల్స్‌లో వినియోగం కన్నా రీటైల్‌గానే ఎక్కువ సేల్‌ అవుతున్నాయి. అందుకు కారణం సిక్స్‌ ప్యాక్‌ మానియానే కావడం అందర్నీ షాక్‌కు గురిచేసే కరుడుగట్టిన వాస్తవం. హార్ట్‌ పేషెంట్‌లో రక్తపోటును సాధారణ స్థాయిలో ఉంచడానికి ప్రిస్కైబ్‌ చేసే మెఫెన్ టెర్మైన్ సల్ఫేట్ థెరపెటిక్ డ్రగ్‌..ఇప్పుడు జిమ్‌ చాటున జోరుగా సేల్ అవుతోంది. ఇవి వాడితే కండలు పొంగుతాయి.. కానీ అతిగా వాడితే అసహజ లక్షణాలతో పాటు మానసిక సమస్యల బారినపడటం ఖాయం. శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలిసినా కొందరు యువకులు.. సిక్స్‌ ప్యాక్‌పై క్రేజ్‌తో స్టెరాయిడ్స్‌కు బానిసలవుతున్నారు.

తాజాగా బెజవాడలో మరో మత్తు కథా చిత్రమ్‌ తెరపైకి వచ్చింది. సిక్స్‌ ప్యాక్‌ కోసం వెంపర్లాడే యువతే టార్గెట్‌గా మెడికల్‌ మాఫియా రెచ్చిపోయిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. టైడాల్‌ ట్యాబ్లెట్‌ ముసుగులో ఈ మెడికల్ మాఫియా మత్తు మందును యువతపై వెద జల్లుతోంది. సిక్స్ ప్యాక్‌ మేకోవర్‌కు ఉవ్విళ్లూరే వాళ్లు..మత్తు కోసం తపించే వాళ్లు..టైడాల్‌ ట్యాబెట్లకు చిత్తవుతున్నారు. డిమాండ్‌ పెరగడంతో మెడికల్‌ మాఫియా ఇతర రాష్ర్టాల నుంచి టైడాల్‌ సరుకును భారీగా దిగుమతి చేసుకుంటోంది. కొకైన్‌, హెరాయిన్‌కు తగ్గని కిక్కించే డ్రగ్‌ అంటూ 350కు వచ్చే టైడాల్‌ ప్యాక్‌ను ఏకంగా రూ.2500 చొప్పున విక్రయిస్తూ క్యాష్‌ చేసుకుంటోంది మెడికల్‌ మాఫియా. సిక్స్‌ ప్యాక్‌ పిచ్చోళ్ల మూలంగా మెడికల్‌ హబ్‌లో టైడాల్‌ వంటి ట్యాబ్లెట్లకు కొరత ఏర్పడుతోంది. అంటే మెడికల్‌ మాఫియా దందా ఏ రేంజ్‌లో సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. వాట్సాప్‌ ఆర్డర్లతో గుట్టు సాగుతున్న మత్తుదందాకు బెజవాడ పోలీసులు ఎట్టకేలకు చెక్‌ పెట్టారు. మెరుపు దాడుల్లో సరుకు బాగానే బయటపడింది

టైడాల్‌ను అధిక మోతాదులో తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్‌ తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇష్టారాజ్యంగా మెడిసిన్స్‌ వాడితే ప్రాణాలకే రిస్క్‌ తప్పదంటున్నారు. జిమ్‌ ట్రైనర్ల మాట కూడా అదే. స్టెరాయిడ్స్‌తో కండలు పెరుగుతాయి కావచ్చు కానీ ఆరోగ్యం క్షీణించి లైఫ్‌ టైమ్‌ కరిగిపోవడం ఖాయం. పోషకవిలువలున్న ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేయాలే తప్ప సిక్స్‌ ప్యాక్‌ కోసం అడ్డదారులు ఎంచుకోవద్దని సూచిస్తున్నారు.

తిండి తింటేనే కండలొస్తాయి. మరి కండలు పెంచితే సరిపోద్దా..కొవ్వు కరగాలంటే కష్టపడాలి.. వ్యాయామం చేయాలి. అప్పుడే బలానికి ఓ అర్ధంపర్ధం. కానీ ఆరోగ్యం కన్నా మజిల్‌ మేకింగ్‌పైనే ఎక్కువగా కాన్‌సెన్‌ట్రేషన్‌ చేస్తున్నారు యువత. కైసీ భీ కండలు పెంచాలి.. సల్మాన్‌ ఖాన్‌లా గుండీలు తీసి సిక్స్‌ ప్యాక్‌ బిల్డప్‌ కొట్టాలి., పీక్స్‌కు వెళ్లిన ఈ పిచ్చినే యువత భవితను నిర్వీర్యం చేసేస్తోంది.

సిక్స్ ప్యాక్స్ మోజులో గుడ్డిగా స్టెరాయిడ్స్ వలలో చిక్కుకుంటే మీ హెల్త్, లైఫ్‌ను డేంజర్‌లో పడేసినట్లే.

సిక్స్ ప్యాక్ కాదు.. లైఫ్ చాలా ముఖ్యం. జరభద్రం బీ కేర్‌ ఫుల్‌ బ్రదర్.

Also Read..

Mahesh Babu : పుష్ప సినిమా పై మహేష్ బాబు ట్వీట్.. అల్లు అర్జున్ రిప్ల్ ఏమిచ్చాడంటే..

Covid Guidelines: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలు జారీ