Mahesh Babu : పుష్ప సినిమా పై మహేష్ బాబు ట్వీట్.. అల్లు అర్జున్ రిప్ల్ ఏమిచ్చాడంటే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన..
Allu Arjun’s Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. ఇక ఈ సినిమాలో మునుపెన్నడూ కనిపించని మాస్ రోల్ లో నటించి ఆకట్టుకున్నాడు బన్నీ. నటన పరంగా అందరి చేత శబాష్ అనిపించుకుంటున్నాడు ఐకాన్ స్టార్. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన పుష్ప సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు పార్ట్ 2పైన అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమా పై సినిమా తారలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పుష్ప సినిమా పై ప్రశంసలు కురిపించారు. రీసెంట్ గా పుష్ప సినిమా చూసిన మహేష్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. పుష్పగా అల్లు అర్జున్ నటన స్టన్నింగ్, ఒరిజినల్, సెన్సేషనల్‌గా ఉంది. అత్యద్భుతంగా నటించాడు. తన సినిమాలు ఎంత వాస్తవంగా, పచ్చిగా, నిజాయితీగా ఉంటాయో సుకుమార్ మరోసారి నిరూపించాడు’ అని చెప్పుకొచ్చాడు. అలాగే ‘పుష్ప’కు పని చేసిన టెక్నీషియన్ల గురించి పేర్కొన్నాడు మహేష్. మహేష్ ట్వీట్ కు రిప్ల్ ఇచ్చాడు బన్నీ.. ‘థ్యాంక్యూ వెరీ మచ్ మహేశ్ బాబు గారూ.. పుష్ప సినిమా టీమ్పని తీరును మీరు మెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అభినందన మా హృదయాలను గెలుచుకుంది’ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. మహేష్ బన్నీ మధ్య జరిగిన ఈ సినిమా సంబాషణతో ఇద్దరు హీరోల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :