Credit Cards: క్రెడిట్ కార్డుదారులు ఈ పొరపాట్లు చేస్తున్నారా..? జాగ్రత్త.. భారీగా నష్టపోతారు
దేశంలో క్రెడిట్ కార్డులు వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఒకప్పుడు కార్డు కావాలంటే ఎంతో ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు బ్యాంకులు సులభంగా క్రెడిట్‌కార్డులను జారీ చేసేస్తున్నాయి. కేవలం..
దేశంలో క్రెడిట్ కార్డులు వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఒకప్పుడు కార్డు కావాలంటే ఎంతో ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు బ్యాంకులు సులభంగా క్రెడిట్‌కార్డులను జారీ చేసేస్తున్నాయి. కేవలం ఫోన్‌ల ద్వారానే వివరాలు సేకరించి కార్డులను అందజేస్తున్నాయి బ్యాంకులు. అయితే క్రెడిట్ కార్డు వాడటంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. కార్డులో డబ్బులు ఉన్నాయి కదా అని ఇబ్బడి ముబ్బడిగా వాడితే బిల్లు చెల్లించే సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. గడువులోగా కార్డు బిల్లు చెల్లిస్తే మేలు.. లేకపోతే అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి ఎదురవుతుంటుంది. ఎందుకంటే వడ్డీ, ఇతర ఛార్జీలు అంటూ భారీగా వడ్డించనున్నాయి బ్యాంకులు. అందుకే క్రెడిట్ కార్డులు వాడే వారు జాగ్రత్తలు పాటించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఇక గడువులోగా బిల్లు చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గిపోయే అవకాశం ఉంది. మీరు భవిష్యత్తులో రుణాలు తీసుకునే సమయంలో ఆ ప్రభావం చూపే ప్రమాదం ఉంది. క్రెడిట్ స్కోర్ తగ్గిపోతే ఏ బ్యాంకు నుంచి కూడా రుణం అందే అవకాశం ఉండదు. దీంతో సమయానికి బిల్లు చెల్లిస్తూ సరిగ్గా వాడుకుంటే రుణాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇలాంటి వారు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. రుణాలు తీసుకున్న వారు, క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నవారి క్రెడిట్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. క్రెడిట్ స్కోర్ అనేది రుణగ్రహిత క్రెడిట్ విలువను సూచిస్తుంది. రుణాలుతీసుకున్న వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ స్కోర్ అందిస్తాయి. క్రెడిట్ స్కోరు ఎక్కువగా ఉంటే, భవిష్యత్తులో తక్కువ రేట్లతో రుణం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేసే అంశాలు.. మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేసే అంశాల గురించి జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం. రుణం లేదా క్రెడిట్ కార్డ్ బకాయిలు సమయానికి చెల్లించకపోతే మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ, మీ స్కోర్‌ను ప్రభావితం చేసే అనేక ఇతర అంశాలు ఉన్నాయి. వాటిపై అందరికీ అవగాహన తక్కువగా ఉంటుంది. అవి ఏంటంటే.. వేరొకరి రుణానికి మీరు హామీ ఇవ్వడం, మీ రుణాన్ని పునర్నిర్మించడం వంటివి.
మినిమమ్ బిల్లు చెల్లిస్తే.. కార్డు బిల్లు వచ్చిన తర్వాత పూర్తిగా చెల్లిస్తే మంచిది. లేకపోతే మినిమమ్ బిల్లు చెల్లించాలని సూచిస్తుంటాయి బ్యాంకులు. అలా పూర్తి బిల్లు చెల్లించకుండా కేవలం మినిమమ్ బిల్లు చెల్లిస్తే కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. దీని వల్ల మీకు వడ్డీ, జీఎస్టీ, ఇతర ఛార్జీలు విధిస్తుంటాయి బ్యాంకులు. ఇలా మినిమమ్ బిల్లు జోలికి వెళ్లకుండా పూర్తి బిల్లు చెల్లిస్తేనే మంచిది. అలాగే అంతేకాకుండా కుటుంబ సభ్యులకు, బంధువులకు హామీదారుగా ఉండటం సర్వ సాధారణం. అయితే ఇలా తరచుగా చేయడం వలన తమ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడుతుందనే విషయం చాలా మందికి తెలిసి ఉండదు. ఒక వేళ కొందరికి తెలిసినా పెద్దగా పట్టించుకోరు. అలాంటి వారికి భవిష్యత్తులో రుణాల విషయంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇలా చేస్తే కొత్త రుణాల కోసం మీ సొంత అర్హత తగ్గడమే కాదు, అసలు రుణగ్రహీతకు బకాయిలు ఉన్నట్లయితే మీరు కూడా నష్టపోవచ్చు. ఎంత మొత్తం ఖర్చు చేసినా.. సమయానికి బిల్లు చెల్లిస్తే బెటర్.
మరిన్ని బెజినెస్ వార్తల కోసం..