AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTP Fraud: ఓటీపీ స్కామ్‌ అంటే ఏమిటి..? మోసాలను ఎలా నివారించాలి..?

సైబర్ నేరాల పెరుగుదల కారణంగా వ్యాపారవేత్తలు కస్టమర్ల డేటా పట్ల మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఇ-కామర్స్ కంపెనీలు కస్టమర్‌లకు మరింత..

OTP Fraud: ఓటీపీ స్కామ్‌ అంటే ఏమిటి..? మోసాలను ఎలా నివారించాలి..?
Otp Fraud
Subhash Goud
|

Updated on: Jan 04, 2023 | 9:00 AM

Share

సైబర్ నేరాల పెరుగుదల కారణంగా వ్యాపారవేత్తలు కస్టమర్ల డేటా పట్ల మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఇ-కామర్స్ కంపెనీలు కస్టమర్‌లకు మరింత సురక్షితమైన డెలివరీకి హామీ ఇవ్వడానికి వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) విధానాన్ని ప్రవేశపెట్టాయి. అయితే, మోసగాళ్లు, స్కామర్లు ఈ రక్షణను సద్వినియోగం చేసుకున్నారు. ఇక డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు కస్టమర్‌ల నుండి ఓటీపీలను సేకరిస్తున్నట్లు ఇటీవల వార్తాపత్రికలు, ఆన్‌లైన్, ఎలక్ట్రానిక్ మీడియాలో నివేదికలు వచ్చాయి. అయితే  ఈ మధ్య కాలంలో మోసాలు జరుగుతున్న నేపథ్యంలో ఓటీపీ నమోదు చేసిన తర్వాతే వస్తువు డెలివరీ చేస్తున్నారు. గతంలో ఓటీపీ లేకుండా చేసే డెలివరీలో మోసాలు జరుగుతున్నాయని గుర్తించి ఈ ఓటీపీలు అడుగుతున్నారు. అయితే ఫోన్‌ ద్వారా మాత్రం అడగరు. మీకు డెలివరీ చేసినప్పుడు మాత్రమే కొరియర్‌ బాయ్‌ ఓటీపీని అడుగుతారని గుర్తించుకోండి.

నకిలీ OTP స్కామ్‌ను ఎలా ఆపాలి?

ఓటీపీని చెప్పొద్దు: ఓటీపీని ఎవరితోనూ షేర్ చేయవద్దు. మీరు ఫోన్, టెక్స్ట్, ఇమెయిల్ ద్వారా మోసగాళ్లకు ఓటీపీని అందించడం ద్వారా చాలా మంది మోసపోతున్నారు. మోసగాళ్లు లావాదేవీలకు సహాయం చేస్తానని లేదా మెరుగైన సేవలను అందిస్తానని తప్పుడు సమాచారంతో మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. ఇలా ఓటీపీ వివరాలు చెప్పినట్లయితే వెంటనే మోసపోయే అవకాశం ఉంది.

ధృవీకరణ: ఏ రకమైన ఓటీపీ కోసం అడిగే వారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో గుర్తించండి. కస్టమర్‌లు టెక్స్ట్ లేదా ఇమెయిల్ ద్వారా పంపబడిన  ఓటీపీ ఉపయోగించి లావాదేవీలను ధృవీకరిస్తారు. కానీ బ్యాంకు నుంచి అయినా, ఇతర సంస్థల నుంచి అయినా ఓటీపీలు గానీ, ఇతర వివరాలు అడగరని గుర్తించుకోవాలి. ఎవరైనా ఫోన్ చేసి మీ ఓటీపీ చెప్పండని అడిగితే జాగ్రత్తగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

డెలివరీ : డబ్బు చెల్లించి డెలివరీని నిర్ధారించే ముందు కస్టమర్‌లు తప్పనిసరిగా డెలివరీ ప్యాకేజీని తెరిచి ఉండేలా చూసుకోవాలి.

నమ్మకం: వ్యక్తిగత సమాచారం కోసం అడిగే ఎలాంటి లింక్‌లు లేదా వెబ్‌సైట్‌లను విశ్వసించవద్దు. డెలివరీపై చెల్లింపులో QR కోడ్‌ని స్కాన్ చేయడాన్ని నివారించడానికి, విశ్వసనీయ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించడానికి ప్రయత్నించండి. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యొక్క ఇంటర్నెట్ క్రైమ్ కంప్లైంట్ సెంటర్ నివేదిక ప్రకారం, 2021లో రికార్డు స్థాయిలో 8,47,376 ఫిర్యాదులు అందాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి