Union Budget 2023: బడ్జెట్‌ కంటే ముందు దీని ధర పెరగనుందా..?

2023 సంవత్సరం ప్రారంభమైంది. కొత్త సంవత్సరంలో కొన్ని మార్పులు ఉండవచ్చు. ఈ మార్పులలో కొన్ని వస్తువుల ధరలు కూడా పెరగవచ్చు. అదే సమయంలో బడ్జెట్ 2023 కంటే ముందే..

Union Budget 2023: బడ్జెట్‌ కంటే ముందు దీని ధర పెరగనుందా..?
Union Budget 2023
Follow us
Subhash Goud

|

Updated on: Jan 04, 2023 | 7:35 AM

2023 సంవత్సరం ప్రారంభమైంది. కొత్త సంవత్సరంలో కొన్ని మార్పులు ఉండవచ్చు. ఈ మార్పులలో కొన్ని వస్తువుల ధరలు కూడా పెరగవచ్చు. అదే సమయంలో బడ్జెట్ 2023 కంటే ముందే ఒక ముఖ్యమైన సమాచారం తెరపైకి వచ్చింది. బడ్జెట్ 2023 కంటే ముందే, బీఈఈ స్టార్ రేటింగ్ సవరించిన నియమాలు అమలులోకి వచ్చాయి. ఆ తర్వాత రిఫ్రిజిరేటర్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ద్వారా ఉపకరణాలకు ఇచ్చే ‘స్టార్ రేటింగ్’ సవరించిన నియమాలు జనవరి 1 నుండి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల అమలుతో రిఫ్రిజిరేటర్ల ధర ఐదు శాతం వరకు పెరుగుతుంది. కొత్త నిబంధనల వల్ల కస్టమర్లు మోడల్‌ను బట్టి రెండు నుంచి ఐదు శాతం వరకు అదనపు భారాన్ని మోయాల్సి వస్తుందని గోద్రెజ్ అప్లయెన్సెస్, హైయర్, పానాసోనిక్ వంటి తయారీదారులు చెబుతున్నారు.

ఉపకరణాలపై ఒకటి నుండి ఐదు వరకు ఉన్న స్టార్‌ గుర్తులు విద్యుత్ వినియోగం గురించి తెలియజేస్తాయి. ఇదే కాకుండా లేబులింగ్ ప్రక్రియ కూడా కఠినతరం చేయబడింది. కొత్త నిబంధనల ప్రకారం, ఫ్రాస్ట్ ఫ్రీ మోడల్‌లలో ఫ్రీజర్, రిఫ్రిజిరేటర్ ప్రొవిజనింగ్ యూనిట్‌లకు (నిల్వ భాగాలు) ప్రత్యేక ‘స్టార్ లేబులింగ్’ తప్పనిసరి చేసింది.

గోద్రెజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది మాట్లాడుతూ, ఇప్పుడు స్టార్ రేటింగ్ కింద రెండింటికీ లేబులింగ్ ప్రకటించాల్సి ఉంటుందని, ఇది కొత్త మార్పు అని అన్నారు. స్టార్‌ రెటింగ్స్‌ను బట్టి కరెంటు వినియోగంలో తేడాలు ఉంటాయన్నారు. ఇది వివిధ మోడల్స్, స్టార్ రేటింగ్‌లపై ఆధారపడి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్ ఫ్రిజ్ ధరలు

ఇది కాకుండా, ఇటీవలి స్టార్ లేబులింగ్‌లో మరో మార్పు ఏమిటంటే స్థూల సామర్థ్యానికి బదులుగా రిఫ్రిజిరేటింగ్ యూనిట్ నికర సామర్థ్యాన్ని ప్రకటించడం. నికర కెపాసిటీ అనేది ఉపయోగించిన సామర్ధ్యం అని వివరించారు. అయితే స్థూల సామర్థ్యం అంటే రిఫ్రిజిరేటర్‌లో స్టోర్‌ చేయడం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి