Union Minister Kaushal kishore: తాగుబోతులకు పిల్లనివ్వొద్దు.. కన్నీరు పెట్టుకున్న కేంద్రమంత్రి..!వీడియో..
తాగుబోతులకు పిల్లనివ్వొద్దన్నారు కేంద్రమంత్రి కౌశల్ కిషోర్. మద్యం కారణంగా తమ కుటుంబం ఎంతో నష్టపోయిందంటూ తన మనసులోని బాధను బయటపెట్టారు. రిక్షాపుల్లర్‌కో, కూలీకో మీ పిల్లనివ్వండి..
తాగుబోతులకు పిల్లనివ్వొద్దన్నారు కేంద్రమంత్రి కౌశల్ కిషోర్. మద్యం కారణంగా తమ కుటుంబం ఎంతో నష్టపోయిందంటూ తన మనసులోని బాధను బయటపెట్టారు. రిక్షాపుల్లర్‌కో, కూలీకో మీ పిల్లనివ్వండి… కానీ, తాగుబోతుకి మాత్రం ఇవ్వొద్దని ఆడపిల్లల తల్లిదండ్రులకు సూచించారు కౌశల్ కిషోర్. తాగుబోతులకు మీ పిల్లనిచ్చి తమ మాదిరిగా కడుపు క్షోభ అనుభవించొద్దని చెప్పారు. మద్యానికి బానిస కావడంతో తమ కుమారుడిని పోగొట్టుకోవాల్సి వచ్చిందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన డి-అడిక్షన్ క్యాంపెయిన్‌లో మాట్లాడిన కౌశల్ కిషోర్… తన కుమారుడు ఎలా మరణించాడో చెప్పుకొచ్చారు. తాను ఎంపీగా, తన భార్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమ కుమారుడు ఆకాష్ మద్యానికి బానిస అయ్యాడన్నారు. చెడు స్నేహాలతో తాగుబోతుగా మారిన ఆకాశ్‌ని డి-అడిక్షన్ సెంటర్‌లో చేర్పించామని గుర్తుచేసుకున్నారు. మద్యం మానేస్తానని చెప్పడంతో పెళ్లి చేశామని, కానీ మళ్లీ మద్యం తాగడం మొదలుపెట్టడంతో, చివరికది మరణానికి దారి తీసిందన్నారు. ఆకాశ్ చనిపోయే నాటికి అతడి కొడుకు రెండేళ్ల వయసు వాడని, దాంతో తండ్రిలేని అనాథగా మారాడంటూ కన్నీటిపర్యంతమయ్యారు. కొడుకునే కాదు కట్టుకున్న భార్యను కూడా అనాథగా వదిలేసి వెళ్లిపోయాడని, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దనే ఇవన్నీ చెబుతానన్నారు కౌశల్ కిషోర్. ఆకాష్ అకాల మరణంతో తామంతా నిత్యం క్షోభ అనుభవిస్తున్నామంటూ చెప్పడంతో అక్కడున్నవాళ్లంతా అవాక్కయ్యారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆరు లక్షల మంది మరణిస్తే.. కేవలం మద్యం కారణంగా ప్రతి ఏటా 20లక్షల మంది మరణిస్తున్నారన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

