Woman Attack: యువకుడి మర్మాంగంపై దాడి.. అసలు నిజాలు బయటపెట్టిన మహిళ..!
సంచలనం సృష్టించిన బ్లేడుతో మర్మాంగం కోసిన మహిళ ఘటనలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకలో జరిగిన సంఘటనపై మీడియాలో
సంచలనం సృష్టించిన బ్లేడుతో మర్మాంగం కోసిన మహిళ ఘటనలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకలో జరిగిన సంఘటనపై మీడియాలో అనేక కథనాలు వెల్లువడ్డాయి. ఉద్దేశపూర్వకంగా మహిళ కావాలనే అతని మర్మాంగంపై దాడి చేసిందని, ప్రియుడిని ఇంటికి పిలిచి కావాలనే ప్రియురాలు ఇలా చేసిందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై తాజాగా సదరు మహిళ స్పందించి అసలు నిజాలు బయటపెట్టింది. తనపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమనన్నారు.. సమాజం అవమానకరంగా చూస్తోందని.. ఆత్మహత్యే శరణ్యం అంటూ ఆ మహిళ బోరున ఏడ్చారు. దాడి ఘటన రోజు రాత్రి బంధువైన కృష్ణ గణేష్ అనే వ్యక్తి తమ ఇంటికి వచ్చాడని మహిళ తెలిపింది. తన భర్త ఇంట్లో లేడని తెలుసుకుని వచ్చి కొన్ని మంచి నీళ్లు తీసుకురమ్మన్నాడు. ఇక నీళ్లు తాగిన తర్వాత ఆ వ్యక్తి అత్యాచారం చేయబోయాడు. అదే సమయంలో ఏం చేయాలో తోచలేదని.. ఆత్మ రక్షణలో భాగంగా ఇంట్లో ఉన్న బ్లేడు తీసుకుని అతడిపై విసిరేశానని తెలిపింది. అనంతరం అతడికి ఎక్కడ గాయం అయిందో కూడా తనకు తెలియదన్నారు. ఈ ఘటనలో అనవసరంగా తనపై ప్రియుడు, ప్రియురాలు అని అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇలా చేస్తే నాకు ఆత్మహత్యే దిక్కంటూ ఆమె తెలిపారు. ఏ మహిళకు ఇలాంటి పరిస్థితి రాకూడదని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు ఘటనకు సంబంధించి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

