Hyderabad: పాతబస్తీలో అర్థరాత్రి గన్‌తో ఎస్ఐ హల్‌చల్..! గన్‌తో బెదిరించిన కారు ఆపిన ఎస్ఐ..
హైదరాబాద్ పాతబస్తీ నడిరోడ్డుపై విధి నిర్వహణలో ఉన్న ఓ ఎస్ఐ గన్‌తో హల్‌చల్ చేశాడు. తెల్లవారుజామున వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు.
హైదరాబాద్ పాతబస్తీ నడిరోడ్డుపై విధి నిర్వహణలో ఉన్న ఓ ఎస్ఐ గన్‌తో హల్‌చల్ చేశాడు. తెల్లవారుజామున వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. అదే సమయంలో ఓపెన్ టాప్ కారులో వచ్చిన వ్యక్తులు ఆపకుండా పారిపోయేందుకు యత్నించారు. దీంతో విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ గన్‌తో బెదిరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఇది చూసిన నెటిజన్లు ”ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ అంటూ విమర్శిస్తున్నారు”. ఈ ఘటన పాతబస్తీ మీర్చౌక్పోలీస్ స్టేషన్పరిధిలో తీవ్ర కలకలం రేపుతోంది. మీర్చౌక్ఎస్ఐ జబ్బార్తన బృందంతో కలిసి అర్థరాత్రి మీర్చౌక్లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నాడు. అటుగా వచ్చిన ఓపెన్ టాప్కారులో ఐదుగురు వ్యక్తులు వస్తుండటాన్ని గమనించిన కానిస్టేబుల్ ఆపే ప్రయత్నం చేశాడు. కారును ఆపకుండా వేగం పెంచడంతో కోపోద్రిక్తుడైన ఎస్ఐ జబ్బార్తన వద్ద ఉన్న గన్ తీసి వారిని కిందకి దిగాలంటూ గట్టిగా కేకలు వేశాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురై కారును నడుపుతున్న వ్యక్తి పక్కకు ఆపాడు. గన్ చేతిలో పట్టుకుని అందరిని కిందకి దిగాలని సూచించాడు. దీంతో అందరూ కిందికి దిగడంతో డ్రైవర్ సీటుతో పాటు వెనుక డిక్కీని క్షుణ్ణంగా పరిశీలించారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో

