Viral Video: పెళ్లి వేదికమీద వధువుని ఎత్తుకుని పడిన వరుడు.. ముద్దుతో స్వీట్ క్షమాపణలు.. వీడియో వైరల్

ఓ పెళ్లి వేడుకలో వరుడు వధువును రొమాంటిక్‌గా ఎత్తుకొని వేదికపైకి తీసుకురావాలనుకున్నాడు. అయితే వరుడు కోరిక వధువుని పడేటట్లు చేసింది.

Viral Video: పెళ్లి వేదికమీద వధువుని ఎత్తుకుని పడిన వరుడు.. ముద్దుతో స్వీట్ క్షమాపణలు.. వీడియో వైరల్
Wedding Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Jan 11, 2023 | 9:24 AM

ఇటీవల పెళ్లికి సంబంధిన వీడియోలు నెట్టింట బాగా వైరల్‌ అవుతున్నాయి. పెళ్లి వేడుకల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు సందడి చేయడం ఒకప్పటి సంప్రదాయం.. కానీ ఇప్పడు ట్రెండ్‌ మారింది.. ఎవరి పెళ్లిలో వారే ఎంటర్‌టైన్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వధూవరులు డాన్స్‌లు చేయడం, రకరకాల చిలిపి పనులు చేయడం పరిపాటిగా మారింది. తాజాగా ఓ పెళ్లి వేడుకలో వరుడు వధువును రొమాంటిక్‌గా ఎత్తుకొని వేదికపైకి తీసుకురావాలనుకున్నాడు. అయితే వరుడు కోరిక వధువుని పడేటట్లు చేసింది.. తాను చేసిన పనికి పెళ్ళికూతురికి రొమాంటిక్ గా క్షమాపణలు చెప్పాడు ప్రస్తుతం నెట్టింట్లో ఈ వెడ్డింగ్ వీడియో వైరల్ అవుతుంది.

ఈ క్రమంలో వధువును ఎత్తుకుని వరుడు మెట్లు దిగుతున్నాడు. అంతే వధువు బరువు బరువును ఆపలేకపోయిన అతని కాలు స్లిప్ అయి మెట్లమీద కూర్చోబడిపోయాడు. వధువు తన ఒడిలోనే ఉంది. అయితే తన పొరబాటును క్షమించమన్నట్టుగా వరుడు వధువు బుగ్గపై ముద్దు పెట్టాడు. అనంతరం మళ్లీ వధువును ఎత్తుకొని వేదికవైపు కదిలాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి వరుడికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. అయితే వరుడు వద్దంటూ తన కాబోయే భార్యను హ్యాపీగా వేదిక వద్దకు తీసుకెళ్లాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by joya jaan (@joyajaan816)

వరుడు తీరుకు అక్కడి వారంతా ముగ్ధులైపోయారు. వరుడిపై ప్రశంసలు కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను రెండు లక్షలమందికి పైగా వీక్షించారు. అదే సంఖ్యలో లైక్‌ చేశారు. తమ కామెంట్లతో వధూవరులపై శుభాకాంక్షలు కురిపించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..