AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking Video: బాడ్మింటన్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలి మరణించిన ఆటగాడు.. కారణం ఏమిటంటే..?

ఆటలు, క్రీడలు మన శారీరక, మానసిక వికాసానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అంతేకాక మన శరీరం దృఢంగా ఉండడానికిి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయి. అయితే ప్రమాదవశాత్తు ఆటలు ఆడతూ నెలకొరిగి చనిపోయిన..

Shocking Video: బాడ్మింటన్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలి మరణించిన ఆటగాడు.. కారణం ఏమిటంటే..?
Man Suffers Heart Attack While Playing Badminton
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 11, 2023 | 11:31 AM

Share

ఆటలు, క్రీడలు మన శారీరక, మానసిక వికాసానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అంతేకాక మన శరీరం దృఢంగా ఉండడానికిి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయి. అయితే ప్రమాదవశాత్తు ఆటలు ఆడతూ నెలకొరిగి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి ఘటనలకు సంబంధించిన పలు వీడియోలను కూడా మనం సోషల్ మీడియాలో చూసే ఉంటాం. అయితే పోయిన వారం చివరలో భారత సంతతికి చెందిన మస్కట్‌ దేశస్థుడి విషయంలో కూడా జరిగింది. బ్యాడ్మింటన్ గేమ్‌లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఆ వ్యక్తి స్పోర్ట్స్ కోర్టులో అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. అతడు ఒక్కసారిగా కిందపడిపోవడంతో నరేంద్ర నాథ్ మిశ్రా అనే జర్నలిస్ట్ ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియోను తన ట్వీట్టర్‌ ఖాతా నుంచి పోస్ట్ చేశాడు. దీంతో ఆ షాకింగ్ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  

‘ఈ ఆకస్మిక మరణం భారత్‌లో జరగలేదు. భారతీయ సంతతికి చెందిన వ్యక్తి మస్కట్‌లోని బాట్మింటన్ కోర్టులో ఆడుతున్నప్పుడు గుండెపోటుతో మరణించాడు’ అని కాప్షన్‌తో జర్నలిస్ట్ మిశ్రా పోస్ట్ చేసిన ఈ వీడియోకు నెటిజన్లు స్పందిస్తున్నారు. వీడియో పోస్ట్ అయిన సెకన్ల కాలంలోనే ట్రెండ్ అవడం ప్రారంభించింది. ఈ వైరల్ వీడియోలో ఎంతో చురుకుగా బాడ్మింటన్ డ్రస్‌లో ఆట ఆడుతున్న అతను హార్ట్ ఎటాక్ కారణంగా కుప్పకూలిపోవడాన్ని మనం చూడవచ్చు. ఆ వెంటనే అప్రమత్తమైన అతని సహచరులను కూడా మనం గమనించవచ్చు. 

ఇలాంటి ఘటనలు గతంలో కూడా చాలా జరిగాయి. జిమ్‌లో భారీ కసరత్తులు చేయడం, ఎంతో వేగంగా పరిగెత్తి వెంటనే నీళ్లు తాగడం, ఆటలాడడం వంటివి చేస్తున్న సందర్భాలలో హార్ట్ ఎటాక్‌కు గురై మరణించినవారు చాలా మంది ఉన్నారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోతో నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..