AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi Fitness: జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత ఫిట్‌నెస్ రహస్యం ఏమిటి..? తెలిస్తే షాక్ కావాల్సిందే..

కాంగ్రెస్ మాజీ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన 3,500 కి.మీ ‘భారత్ జోడో యాత్ర’ చివరి దశకు చేరుకుంది. పుష్-అప్ ఛాలెంజ్‌లు చేయడం, ట్యాంకుల పైకి ఎక్కడం, పిల్లలను భుజాలపై ఎక్కించుకోవడం, ఉత్తర భారతంలోని చలిలో స్వెటర్ కూడా ధరించకపోవడం..

Rahul Gandhi Fitness: జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత ఫిట్‌నెస్ రహస్యం ఏమిటి..? తెలిస్తే షాక్ కావాల్సిందే..
Rahul Gandhi Fitness Levels During Bharat Jodo Yatra
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 09, 2023 | 1:41 PM

కాంగ్రెస్ మాజీ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన 3,500 కి.మీ ‘భారత్ జోడో యాత్ర’ చివరి దశకు చేరుకుంది. ఇందుకు ఆయన ఫిట్‌నెస్‌యే ఎంతగానో సహకరించిందని చెప్పుకోవచ్చు. పుష్-అప్ ఛాలెంజ్‌లు చేయడం, ట్యాంకుల పైకి ఎక్కడం, పిల్లలను భుజాలపై ఎక్కించుకోవడం, ఉత్తర భారతంలోని చలిలో స్వెటర్ కూడా ధరించకపోవడం.. ఇలాంటి ఫీట్లను చేస్తూనే ప్రతి రోజూ కనీసం 25 కిలోమీటర్లు నడిచిన రాహుల్ గాంధీ కన్యా కుమారి నుంచి ఉత్తర ప్రదేశ్ వరకు చేరుకున్నారు. జోడో యాత్రలో రాహుల్‌తో పాటు వచ్చిన వారు ఆయనతో నడవడం కష్టమని చేతులెత్తేసి చెప్పినవారు ఉన్నారు. మరి ఐదు పదుల వయసులోనూ రాహుల్ ఇలా ఎలా చేయగలిగారు..? ఆయన ఫిట్‌నెస్ వెనుక ఉన్న రహస్యం ఏమిటి..? వంటి విషయాలపైనే దేశం మొత్తం ఇప్పుడు చర్చిస్తోంది.

అయితే పలు వార్తా కథనాల ప్రకారం.. రాహుల్ మాత్రమే కాక ఆయన కుటుంబం మొత్తం ధ్యాన్యాన్ని బాగా ఇష్టపడి తింటారు. రాహుల్ ఆధ్యాత్మికతను విశ్వసించడంతో పాటు తరచూ వివిధ ధ్యాన కేంద్రాలను సందర్శిస్తుంటారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్సింగ్ సూర్జేవాలా ‘రాహుల్ ధ్యాన ఆధ్యాత్మికతను చాలా జ్ఞానోదయం, ప్రశాంతతగా భావిస్తార’ని మీడియా ప్రతినిధులతో అన్నారు. అలాగే రాహుల్ కఠినమైన, సాధారణ వ్యాయామ షెడ్యూల్‌ను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రతీ రెండు రోజులకు ఒక సారి 12-కిమీ పరుగు తీస్తారని  పేర్కొన్నారు రణదీప్ సూర్జేవాలా.

ఇవి కూడా చదవండి

గింజలు, విత్తనాలు శరీరానికి ఎలాంటి ప్రయోజనం కలుగుతాయి..?

గింజలు, విత్తనాలను ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్లు, విటమిన్లు, ఖనిజాలతో నిండిన సూపర్ ఫుడ్స్‌గా పరిగణిస్తారు. ఇవి శరీర బరువును నియంత్రించడమే కాక శరీరంలోని కొవ్వులను కరిగిస్తాయి. గింజలు, విత్తనాలు రుచికరంగా ఉండడమే కాక అనేక రకాల బరువు ప్రయోజనాలను కూడా అందిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆ ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

పోషకాల నిధి: గింజలు, విత్తనాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 30 గ్రాముల మిశ్రమ గింజలలో 173 కేలరీలు, 5 గ్రాముల ప్రోటీన్లు, కేవలం 16 గ్రాముల కొవ్వులు ఉంటాయి. ఇంకా ఇందులో 9 గ్రాముల మోనోశాచురేటెడ్ కొవ్వు కూడా ఉంటుంది. డైటీషియన్ల ప్రకారం కార్బ్ కంటెంట్ చాలా వేరియబుల్ అయినప్పటికీ గింజలు సాధారణంగా తక్కువ కార్బ్‌ను కలిగి ఉంటాయి.

ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు: గింజలు, విత్తనాలు యాంటీ ఆక్సిడెంట్లకు పవర్‌హౌస్‌లు. వీటిలో శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడం ద్వారా ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొనే పాలీఫెనాల్స్ ఉన్నాయి. అస్థిర అణువులు కణ నష్టాన్ని కలిగించి, వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. దీనిని నిరోధించడానికి యాంటీఆక్సిడెంట్లు ఉపకరిస్తాయి.

బరువు నియంత్రణ: గింజలు, గింజలలో కేలరీలు అధికంగా ఉన్నప్పటికీ.. బరువు తగ్గడంలో లేదా నియంత్రించడంలో సహాయపడతాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఆహారం తినేవారి కంటే విత్తనాలు, గింజలను తినేవారు వేగంగా బరువు తగ్గుతారు. ఇంకా వారిలో బరువు స్థిరంగా ఉంటుంది. అలాగే ఆరోగ్య నిపుణుల ప్రకారం అధిక బరువు ఉన్న మహిళలు క్రమం తప్పకుండా బాదంపప్పును తింటే.. వారు దాదాపు మూడు రెట్లు ఎక్కువ బరువు కోల్పోతారు. ఇంకా ఇతరులతో పోలిస్తే నడుము పరిమాణం గణనీయంగా తగ్గుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది: గుమ్మడికాయ, పిస్తాపప్పులు, నువ్వులు వంటి విత్తనాలు, గింజలు.. కొలెస్ట్రాల్ మరియు,  ట్రైగ్లిజరైడ్ స్థాయిలపై అద్భుతమైన ప్రభావాలను చూపిస్తాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం ఊబకాయం, మధుమేహం ఉన్నవారిలో ట్రైగ్లిజరైడ్‌లను పిస్తాపప్పులు తగ్గిస్తాయని తేలింది. ఈ నట్స్‌లో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..