Andhra Pradesh: డే-2 కూడా అదే టెన్షన్..! కుప్పంలో హైవోల్టేజ్ హీట్..! తగ్గేదే లే అంటున్న చంద్రబాబు..!
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన పర్యటన రెండో రోజూ హైవోల్టేజ్ హీట్ సీన్ కొనసాగింది. అయినా తగ్గేదే లే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన పర్యటన రెండో రోజూ హైవోల్టేజ్ హీట్ సీన్ కొనసాగింది. అయినా తగ్గేదే లే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు. మాటకు మాటగా సాగుతున్న ఈ పర్యటనలో ఒక వైపు అధికార వైసీపీకి కౌంటర్లు ఇస్తూనే రెండో రోజూ కొనసాగారు ఆయన. బుధవారం మొదలైన ఈ పర్యటనకు పోలీసులు ‘నో పర్మిషన్’ అనడంతో గందరగోళంగా మారింది కుప్పం నియోజకవర్గం. ఈ క్రమంలో కుప్పంలోనే మకాం వేశారు చంద్రబాబు. పోలీసులు నో పర్మిషన్ అనడంతో కాలినడకనే నిరసన యాత్ర చేపట్టారు చంద్రబాబు. కుప్పం R&B గెస్ట్‌హౌస్ నుంచి MM మహల్ వరకు కాలినడకనే వెళ్లారు. అనంతరం బూత్ కమిటీ కన్వీనర్లతో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న టీడీపీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు.
అయితే చంద్రబాబు తీరుపై విరుచుకుపడ్డారు అధికార పార్టీ నేతలు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకే జీవోనెంబర్ 1 తీసుకొచ్చామన్నారు. సీఎం జగన్‌పై ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని టీడీపీ నేతలను వైసీపీ నేతలు హెచ్చరించారు. అంతకముందే డీజీపీకి 4 పేజీల లేఖ రాశారు చంద్రబాబు. పలమనేరు డీఎస్పీపై తక్షణం చర్యలు తీసుకోవడంతోపాటు.. ఆటంకాలు లేకుండా పర్యటన సాగేలా అనుమతులివ్వాలని కారారు.
కాగా, మొదటి రోజు పర్యటనకు సంబంధించి పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. పోలీసుల విధులను టీడీపీ నేతలు అడ్డుకోవడంపై మూడు కేసులు నమోదు అయ్యాయి. గొల్లపల్లి, శాంతిపురం, పెద్దూరు ఘటనపై ఈ కేసులు ఫైల్ చేశారు. పెద్దూరులో ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డిని దూషించిన ఘటనలో.. గొల్లపల్లి వద్ద సీఐ విధులకు ఆటంకం కల్గించినందుకు కేసు నమోదైంది. శాంతిపురంలోని ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం మూడు ఘటనల్లో టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..