AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Veera Simha Reddy: పొలిటికల్ హీట్ పెంచిన ఫ్లెక్సీ.. వైసీపీ ఎమ్మెల్యే తనయుడు బాలకృష్ణ సినిమాకు ప్లెక్సీ ఏర్పాటు

ఎమ్మిగనూరు రాజకీయాల్లో ప్లెక్సీ కలకలం రేపుతుంది. వైసీపీ ఎమ్మెల్యే తనయుడు బాలయ్య సినిమాకు ప్లెక్సీ ఏర్పాటు దుమారానికి దారి తీసింది.

Veera Simha Reddy: పొలిటికల్ హీట్ పెంచిన ఫ్లెక్సీ.. వైసీపీ ఎమ్మెల్యే తనయుడు బాలకృష్ణ సినిమాకు ప్లెక్సీ ఏర్పాటు
Veera Simha Reddy Flex
Surya Kala
|

Updated on: Jan 06, 2023 | 8:33 AM

Share

సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని పలు సందర్భాల్లో రాజకీయ నేతలు చెబుతూనే ఉంటారు. తెలంగాణలోని టీఆర్ఎస్ లోని మంత్రులు, నేతలే లేదు.. అటు ఆంధ్రప్రదేశ్ లోని పలువురు నేతలు తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ , మెగాస్టార్ చిరంజీవి అని చెబుతూ ఉంటారు.. తాజాగా ఇదే విషయాన్నీ మరోసారి రుజువు చేశాడు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తనయుడు.. ఉమ్మడి కర్నూలు జిల్లా లోని ఎమ్మిగనూరు రాజకీయాల్లో ప్లెక్సీ కలకలం రేపుతుంది. వైసీపీ ఎమ్మెల్యే తనయుడు బాలయ్య సినిమాకు ప్లెక్సీ ఏర్పాటు దుమారానికి దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే..

బాలయ్య కొత్త సినిమా వీరసింహారెడ్డి విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ రాజకీయ దుమారం రేపుతుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే తనయుడు తన ఫోటోతో ఏర్పాటు చేసిన ప్లెక్సీ చర్చనీయాంశమైంది. వైసీపీ వాళ్లు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమాకు ప్లెక్సీ ఏర్పాటు చేయడం అటు వైసీపీ, ఇటు టీడీపీ శ్రేణుల్లో ఆసక్తి రేపుతుంది. బాలయ్య సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి తనయుడు ధరణిదర్ రెడ్డి ఫోటోతో ప్లెక్సీ ఎమ్మిగనూరులో హల్చల్ చేస్తుంది. పోస్టర్ లో బాలయ్య పక్కన ధరణి దర్ రెడ్డి ఫోటో పెట్టి రాబోయే తరానికి కాబోయే ఎమ్మెల్యే అంటూ రాసిన కొటేషన్స్‌ రాయించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ధరణిదర్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేస్తారనే టాక్ వినిపిస్తుంది.

ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని వారసుడికి సీటు ఇవ్వాలంటూ అధిష్టానం దగ్గర ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ప్రపోజల్ పెట్టినట్లు టాక్. ఇదేసమయంలో ఎమ్మగనూరు నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎం.పి బుట్టా రేణుక, లింగాయుత కార్పొరేషన్ చైర్మన్ రుద్ర గౌడ్, మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డితో పాటు పెద్ద ఎత్తునే ఆశావాహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి సమయంలో ధరణిదర్ రెడ్డి ఫొటోతో ప్లెక్సీ ఏర్పాటు చేయడం.. కాబోయే ఎమ్మెల్యే అని కొటేషన్స్ రాయడం ఆశావులకు కౌంటర్ గా కనిపిస్తుంది. ఈ ఫ్లెక్సీ వివాదం ఎంతవరకు దారితీస్తుందో అనే చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!