Chandrababu – Jagan: జగన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు..! ఓటమి భయంతో తప్పుడు కేసులు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తీరుపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో ఏం జరుగుతుందో ప్రపంచంలోని తెలుగు వారంతా చూశారన్న చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తీరుపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో ఏం జరుగుతుందో ప్రపంచంలోని తెలుగు వారంతా చూశారన్న చంద్రబాబు.. తాను సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ కుటుంబం పాదయాత్ర, మీటింగ్ లు పెట్టారని గుర్తు చేశారు. ఎక్కడా ఆటంకం కలిగించలేదన్నారు. జీవో నెంబర్ 1 ను తనపై ప్రయోగించారని మండిపడ్డారు. సొంత నియోజకవర్గం కుప్పంలో సొంత వారిని కలుసుకునేందుకు వీలు లేకుండా చేశారని ఆక్షేపించారు. ఇలా చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ప్రచార రథాల వాహనాలను సీజ్ చేసి భయబ్రాంతులకు గురిచేశారన్న చంద్రబాబు.. కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. జగన్ కు పిరికితనం, ఓటమి భయంతో తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కొందరు పోలీసుల తీరు ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేలా ఉందని ఫైర్ అయ్యారు. పోలీసు వ్యవస్థ వాహనానికి మైక్ పర్మిషన్ ఇస్తుందా లేదా అని అడుగుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
కోటు విప్పి.. కండువా కట్టి.. ఆవు పేడ ఎత్తిన జర్మనీ రాయబారి!
భర్త చనిపోయిన 10 రోజులకే.. భార్య కూడా!
ఉదయం పెళ్లి.. సాయంత్రం డైవర్స్..
మార్నింగ్ వాక్లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్!
తెలివిగా ఫోను కొట్టేద్దామనుకున్నాడు.. అందుకే చుక్కలు చూపించారు!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!

