Viral Video: డ్యాన్స్ చేయాలనే కోరిక ఉంటే చాలదా లావైతేనేమి.. ప్లోర్‌మూమెంట్‌ని ఓ రేంజ్‌లో చేసిన యువతి

తన ఒంట్లో ఎక్కడుందో కూడా కనిపించని నడుమును బెల్లి డ్యాన్స్ రేంజ్ లో ఊపుతూ..  ఫ్లోర్‌ మూమెంట్స్‌ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది

Viral Video: డ్యాన్స్ చేయాలనే కోరిక ఉంటే చాలదా లావైతేనేమి.. ప్లోర్‌మూమెంట్‌ని ఓ రేంజ్‌లో చేసిన యువతి
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jan 11, 2023 | 12:28 PM

భోజ్‌పురి సాంగ్‌ ‘పత్లి కమారియా మోరీ’ ఎంత పాపులర్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఈ పాట మీద ఎంతోమంది డాన్స్‌ చేస్తూ రీల్స్‌ చేశారు. దాంతో ఈ సాంగ్‌ మరింత పాపులర్‌ అయిపోయింది. చిన్న,పెద్ద తేడా లేకుండా ఈ పాటకు స్టెప్పలు వేశారు. అయితే ఇలాంటి డాన్స్‌ మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు. ప్రస్తుతం ఈ భోజ్‌పురి పాటకు ఓ యువతి చేసిన డాన్స్‌ ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తుంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ యువతి చాలా లావుగా ఉంది. అంత భారీ శరీరంతో డాన్స్‌ చేయడం కాదుకదా… అడుగుతీసి అడుగు వేయడమే కష్టం. అలాంటిది ఆ యువతి అంత భారీ శరీరంతో కూడా ఎంతో ఈజీగా డాన్స్‌ చేసింది.

తన ఒంట్లో ఎక్కడుందో కూడా కనిపించని నడుమును బెల్లి డ్యాన్స్ రేంజ్ లో ఊపుతూ..  ఫ్లోర్‌ మూమెంట్స్‌ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. నెటిజన్లు ఆ యువతిని విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోను 17 మిలియన్లమందికి పైగా వీక్షించారు. 4 లక్షలమందికి పైగా వీడియోను లైక్‌ చేశారు. ఫన్నీ కామెంట్లతో హోరెత్తించారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by RAANI? (@mus_ra1)

ఒక వినియోగదారు ‘ఇంత సన్నని నడుము నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు’ అని మరో వినియోగదారు రాశారు. ‘సన్నని నడుము ఎక్కడ ఉంది’ అని రాస్తే.. ఒక వినియోగదారు ఏదైనా జరగవచ్చు అని కామెంట్ చేసారు. మరో యూజర్‌ మాత్రం నాకు అమ్మాయి విశ్వాసం నచ్చిందంటూ ప్రశంసించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..