Viral Video: హెల్మెట్ లేకుండా అడ్డంగా దొరికిన అమ్మాయిలు.. పోలీసుల ఇచ్చిన రియాక్షన్‌ చూస్తే..!

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Jan 11, 2023 | 12:44 PM

సాధారణంగా హెల్మెట్ లేకుండా బైక్ నడపడం ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించడమే.. అంటే చట్టరీత్యా నేరమే. ఈ తప్పు చేసి ఎవరు దొరికినా...

Viral Video: హెల్మెట్ లేకుండా అడ్డంగా దొరికిన అమ్మాయిలు.. పోలీసుల ఇచ్చిన రియాక్షన్‌ చూస్తే..!
Trending Video

సాధారణంగా హెల్మెట్ లేకుండా బైక్ నడపడం ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించడమే.. అంటే చట్టరీత్యా నేరమే. ఈ తప్పు చేసి ఎవరు దొరికినా ట్రాఫిక్ పోలీసులు ఫైన్ లేదా బైక్ సీజ్ చేస్తుంటారు. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు అమ్మాయిలు హెల్మెట్ లేకుండా పోలీసులకు దొరికారు. వారితో సదరు పోలీసులు ప్రవర్తించిన తీరుకు అబ్బాయిలు కోపంతో రగిలిపోతున్నారు. హెల్మెట్ లేకుండా అబ్బాయిలు దొరికితే ఒక న్యాయం.? అమ్మాయిలకు మరో న్యాయమా.? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

స్థానిక బదౌన్ నగరంలో ఇద్దరు అమ్మాయిలు స్కూటీపై హెల్మెట్ లేకుండా పోలీసులకు దొరికారు. వాళ్లతో పోలీసులు నవ్వుతూ మాట్లాడారు. ‘హెల్మెట్ పెట్టుకోకుండా లైఫ్‌ని ఎందుకు రిస్క్‌లో పెడతారంటూ’ నవ్వుతూ ఆప్యాయంగా ఆ అమ్మాయిలతో పోలీసులు మాట్లాడిన ఓ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.

ఇక ఈ వీడియోపై అబ్బాయిలు ఫైర్ అవుతున్నారు. అమ్మాయిలు కాబట్టి నవ్వుతూ మాట్లాడుతున్నారు. అదే అబ్బాయిలు అయితే ఇలా మాట్లాడతారా.? కనీసం ఆ అమ్మాయిలకు 10 శాతమైన జరిమానా వేశారా.? అబ్బాయిలకే అన్నీ రూల్స్.. అమ్మాయిలకు నో రూల్స్ అంటూ పలు రకాల కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu