Viral: టీవీ చూస్తుండగా ఊహించని పరిణామం.. అనుకోని అతిధి రాకతో అందరూ హడల్.!
ఓ ఫ్యామిలీ ఎంచక్కా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో వారికి ఓ ఊహించని పరిణామం ఎదురైంది.
ఓ ఫ్యామిలీ ఎంచక్కా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో వారికి ఓ ఊహించని పరిణామం ఎదురైంది. అనుకోని అతిధిలా ఇంటి సీలింగ్ నుంచి ఉన్నట్టుండి ఊడిపడిన భారీ అనకొండను చూసి ఒక్కసారిగా ఆ కుటుంబం హడలెత్తిపోయింది. దెబ్బకు భయంతో బయటికి పరుగులు తీసింది. ఈ భయానక ఘటన మలేషియాలో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే..?
మలేషియాలోని సరావాక్ స్టేట్‌లో నివాసముంటున్న ఓ కుటుంబానికి భయానక అనుభవం ఎదురైంది. ఆ కుటుంబలోని నలుగురు సభ్యులు అంతా కలిసి ఓ చోట కూర్చుని హాయిగా టీవీ చూస్తుండగా.. ఎక్కడ నుంచి వచ్చిందో గానీ.. ఒక్కసారిగా భారీ పైథాన్ సీలింగ్ నుంచి జారిపడింది. దీంతో వారందరూ కూడా భయంతో బయటికి పరుగులు పెట్టారు. అయితే కాసేపటి తర్వాత కుదుటపడిన కుటుంబ సభ్యులు స్థానికంగా ఉండే డిస్ట్రిక్ట్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారం అందించారు. అక్కడ నుంచి నలుగురు సభ్యులు సమయానికి బాధితుల నివాసానికి చేరుకున్నారు. కిచెన్‌లోకి దూరి ఓ బాక్స్‌లో దాక్కున్న కొండచిలువను అతికష్టం మీద పట్టుకుని బంధించారు. సుమారు 10 అడుగులు పొడవున్న కొండచిలువను ప్రత్యేక పరికరాలతో పట్టుకున్నారు.
కాగా, కుటుంబంలోని నలుగురికి పైథాన్ వల్ల ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని.. అందరూ సురక్షితంగానే ఉన్నాయని కంట్రోల్ సెంటర్ అధికారులు తెలిపారు. ఈ కొండచిలువ ప్రపంచంలో అత్యంత పొడవైన పైథాన్ జాతులలకు చెందినదని.. ఇవి గరిష్టంగా 31.5 అడుగుల పొడవు పెరుగుతాయని రిపోర్ట్స్‌లో పేర్కొన్నారు. అలాగే మలేషియాలో ఇటీవల అడువుల నరికివేత కారణంగా కొండచిలువలు ఇలా జనావాసాల్లోకి వస్తున్నాయని తెలిపారు.