Pakistan Crisis: గోధుమ పిండి బస్తాలకు AK-47తో జవాన్ రక్షణ.. ఆకలితో పాక్ ప్రజల ఆర్తనాదాలు.. చంపేయమంటూ వినతి..

ప్రస్తుతం పాక్ లో ఆహార కొరత ఏ రేంజ్ కు చేరుకుందో.. ఓ సంఘటన ఉదాహరణగా నిలుస్తుంది. గోధుమ పిండి బస్తాల భద్రత కోసం.. సైనికుడిని నియమించారు. అతను AK-47తో పిండి బస్తాలను రక్షిస్తున్నాడు. 

Pakistan Crisis: గోధుమ పిండి బస్తాలకు AK-47తో జవాన్ రక్షణ.. ఆకలితో పాక్ ప్రజల ఆర్తనాదాలు.. చంపేయమంటూ వినతి..
Pakistan Economic Crisis
Follow us
Surya Kala

|

Updated on: Jan 11, 2023 | 8:39 AM

దాయాది దేశం పాకిస్థాన్ ..  శ్రీలంక బాటలో పయనిస్తున్నట్లు అనిపిస్తోంది.. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారింది. ద్రవ్యోల్బణ సమస్య రోజు రోజుకీ తీవ్రమవుతుంది. దీంతో ఆదేశంలో నిత్యావరస ధరలు అంబరాన్ని తాకుతున్నాయి. భారత్‌లో రూ.5కు లభించే పార్లేజీ బిస్కెట్‌ను పాకిస్థాన్‌లో రూ.50కి విక్రయిస్తున్నారు. మన దేశంలో  40, నుంచి  50 రూపాయలకు లభించే బ్రెడ్‌ను పాకిస్థాన్‌లో రూ. 150 నుంచి రూ. 200 వరకూ విక్రయిస్తున్నారు. పిడికెడు గోధుమ పిండి కోసం పోరు సాగుతోంది. ప్రస్తుతం పాక్ లో ఆహార కొరత ఏ రేంజ్ కు చేరుకుందో.. ఓ సంఘటన ఉదాహరణగా నిలుస్తుంది. గోధుమ పిండి బస్తాల భద్రత కోసం.. సైనికుడిని నియమించారు. అతను AK-47తో పిండి బస్తాలను రక్షిస్తున్నాడు.

మరోవైపు పాక్ ప్రజలు తమకు గోధుమ పిండిని ఇప్పించాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉగ్రవాద దేశం అన్నమో రామచంద్ర అంటూ విలపిస్తోంది. అయితే ఇంత జరిగినా.. ఇంత దారుణంగా ఉన్నా.. ఉగ్రవాదుల స్థావరాలు అలాగే ఉన్నాయి. యధావిధిగా కొందరు వ్యక్తులు భారత దేశం మీద పడి ఏడుస్తూనే ఉన్నారు.. తాజాగా బిలావల్ వంటి పాక్ నాయకులు భారతదేశం,  ప్రధాని మోడీ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్‌కు చెందిన దుకాణదారుడు ధరలు భారీగా పెరిగాయని చెప్పారు. గతంలో రూ.5కు విక్రయించే బిస్కెట్ ఇప్పుడు రూ.50కి విక్రయిస్తున్నారు. కిలో పిండి రూ.450కి విక్రయిస్తున్నారు. వంట నూనె లీటరు ధర రూ. 850కి చేరింది. ధరలు 50 శాతం వరకు పెరిగాయి. దీంతో ఇక్కడి ప్రజలు వీధుల్లోకి వచ్చారు. మేము ఈ పరిస్థితిని తట్టుకోలేకపోతున్నాం.. మమ్మల్ని ప్రభుత్వం చంపేయమంటూ ప్రజలు వేడుకుంటున్నారు.  కొందరు వాహనాల కింద పడుకుని మా మీద నుంచి ఈ వాహనాన్ని ఎక్కించమంటూ వేడుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇక్కడి దుస్థితిని తెలిపే విధంగా అనేక వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రజలు క్యూలైన్లలో ఆహార పదార్థాల కోసం పడిగాపులు కాస్తున్నారు.

ఓ వీడియోలో ఓ వ్యక్తి కారు కింద పడుకుని గోధుమ పిండి ఇవ్వలేకపోతే మాపై నుంచి కారు ఎక్కించి  మమ్మల్ని అంతమొందించండి అంటూ విలపిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. పాక్‌లో గోధుమ పిండి బస్తాల కోసమే గొడవలు జరుగుతున్నాయని క్యాప్షన్‌లో రాశారు. వందలాది మంది మహిళలు ట్రక్కు వెనుక పరుగులు తీస్తున్న మరో వీడియో బాగా వైరల్ అవుతోంది. ఈ ట్రక్కులో గోధుమ పిండి బస్తాలు లోడ్ చేసినట్లు కనిపిస్తోంది.

విదేశీ సొమ్ము తమకు వచ్చిన సమయంలో ఆ డబ్బుని ఎప్పుడూ పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. మన దేశం మీదకు వారిని ఎగదోసి.. తన పబ్బం గడుపుకునేదు.. వాస్తవానికి ఈరోజు పాకిస్తాన్ లోని ఈ దారుణ పరిస్థితికి కారణం భారీ స్థాయిలో విదేశీ అప్పులతో పాటు విధాన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు లేని దేశాల్లో పరిస్థితి ఇలా దిగజారడమే అని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు.

పాకిస్థాన్‌కు అమెరికా సాయం చేసినంత కాలం.. తీసుకున్న నిర్ణయాలకు ఫిలితాన్ని నేడు ఆ దేశ ప్రజలు అనుభవిస్తున్నారు.  ఉగ్రవాదాన్ని పెంచి పోషించి తనకు తానే పక్కలో బల్లెం ను తయారు చేసుకుంది.. ఇప్పుడు ఆ దేశంవైపు ఏ విదేశీ కంపెనీలు చూడడం లేదు..పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని కనబరచడం లేదు. మరోవైపు గత ఏడాది.. వచ్చిన వరద బీభత్సం సృష్టించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో జనం ఆకలి తీర్చమంటూ రోదిస్తున్నారు. చాలా రోజులుగా ప్రజలకు తినడానికి కనీసం గోధుమ పిండి కూడా దొరకడం లేదు. ఒక వీడియోలో.. ఒక పోలీసు తన చేతుల్లో AK-47తో పిండి బస్తాలను కాపాడుతున్నాడు. ఇటీవల ప్రధాని షరీఫ్‌ ఆధ్వరంలో కేబినెట్‌ సమావేశం జరిగింది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ముందుగా ఇంధన పొదుపు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశం బహిరంగ ప్రదేశంలో నిర్వహించడం విశేషం

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..