AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రేపటి పౌరుడు ఈ బాలుడు.. స్వామి వివేకానందగా అమూల్యమైన ప్రసంగంతో ఆకట్టుకున్న చిన్నారి..

వైరల్ అవుతున్న వీడియోలో, స్వామి వివేకానంద వేషంలో ఉన్న ఒక పిల్లవాడు వివేకానంద స్వామి వేషంలో ఆయన జీవితాన్ని పరిచయం చేస్తూనే.. విలువైన ఆలోచనలను మన ముందు ఉంచాడు. నా పేరు స్వామి వివేకానంద..

Viral Video: రేపటి పౌరుడు ఈ బాలుడు.. స్వామి వివేకానందగా అమూల్యమైన ప్రసంగంతో ఆకట్టుకున్న చిన్నారి..
Kid Video Viral
Surya Kala
|

Updated on: Jan 12, 2023 | 1:16 PM

Share

స్వామి వివేకానంద జన్మదినం జనవరి 12వ తేదీన జాతీయ యువజన దినోత్సవంగా ప్రతి ఏడాది జరుపుకుంటారు. స్వామి వివేకానంద జయంతిని మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా యువజన దినోత్సవంగా ఘనంగా జరుపుకోవడం విశేషం. స్వామి వివేకానంద ఎంతటి మహనీయుడంటే.. ఆయన తన శక్తివంతమైన ప్రసంగంతో యువతలో స్ఫూర్తిని నింపాడు. నేటికీ ఆయన ప్రసంగాలు యువతకు స్ఫూర్తినిస్తాయి. యువతను ప్రోత్సహించడానికి ఆయన చెప్పిన విషయాలు నేటి తరానికి అనుసరణీయం. ప్రస్తుతం ఓ చిన్నారి వీడియో బయటకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ చిన్నారి బాలుడు స్వామి వివేకానందగా మారి యువతకు విలువైన పాఠాలు చెబుతున్నాడు.

స్వామి వివేకానంద సరళమైన జీవితం, ఆయన గొప్ప ఆలోచనలు అందరికీ స్ఫూర్తిదాయకం. ఈ ప్రపంచం పిరికివాళ్ల కోసం కాదు, మీ చేసే పోరాటం ఎంత గొప్పదైతే.. అది ఇచ్చే విజయం అంత గొప్పదని ఆయన చెప్పిన విషయాలు ఈ విషయాలు నేటికీ ప్రజల జీవితాల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇప్పుడు స్వామి వివేకానంద అమూల్యమైన ఆలోచనలను ప్రజల ముందు ఉంచుతున్నాడు  ఈ చిన్నారి బాలుడు . ఇది చూసిన తర్వాత ఎవరైనా ఆ బాలుడిని ఇష్టపడక మానరు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో, స్వామి వివేకానంద వేషంలో ఉన్న ఒక పిల్లవాడు వివేకానంద స్వామి వేషంలో ఆయన జీవితాన్ని పరిచయం చేస్తూనే.. విలువైన ఆలోచనలను మన ముందు ఉంచాడు. నా పేరు స్వామి వివేకానంద.. నా చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్, నేను కోల్‌కతాలో పుట్టాను.. ‘ప్రతి ఒక్కరూ మేల్కొమని, లక్ష్యాన్ని సాధించే వరకు ఆగవద్దు’ అని చిన్నారి వీడియోలో చెప్పాడు. ఈ క్లిప్ చివరిలో.. పిల్లవాడు అందమైన రీతిలో ధన్యవాదాలు చెప్పాడు.

చిన్నారి వివేకానంద 

వీడియో చూసిన తర్వాత..నెటిజన్లు చిన్నారి వివేకాపై ప్రశంసల వర్షం కురిపించారు. స్నేహితులు , బంధువులకు ఈ వీడియో షేర్ చేస్తారు. ‘నిజంగా వీడియోలో పిల్లవాడు ఇచ్చిన సందేశం అద్భుతంగా ఉంది..’ అని ఒకరు వీడియోపై వ్యాఖ్యానిస్తూ, ‘నిజంగా ఎవరైనా స్వామి వివేకానంద ఈ  ఆలోచనలను తన జీవితంలో అమలు చేస్తే.. అతని జీవితం గొప్ప బాటలో నడుస్తుందని మరొకరు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..