Viral Video: సైకిల్‌ తొక్కుతూ సూపర్ హిట్ సాంగ్‌కు ఓ రేంజ్‌లో డ్యాన్స్ చేసిన యువతి.. నెట్టింట్లో వీడియో వైరల్

ఈ యువతి తరచూ ఇలాంటి వీడియోలు చేస్తుంది. అయినా ప్రతిదానిలో కొత్తదనాన్ని చూపడం ఈమె ప్రత్యేకత. ఈ యువతి స్పెషాలిటీ ఏంటంటే.. సైకిల్‌ తొక్కుతూ నృత్యం చేయడం. హ్యాండిల్‌ వదిలేసి ఎంతో ఫాస్ట్‌గా పాటకు తగ్గ స్టెప్పులతో డాన్స్‌ చేస్తుంది.

Viral Video: సైకిల్‌ తొక్కుతూ సూపర్ హిట్ సాంగ్‌కు ఓ రేంజ్‌లో డ్యాన్స్ చేసిన యువతి.. నెట్టింట్లో వీడియో వైరల్
Dance Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Jan 13, 2023 | 12:58 PM

ప్రతిరోజూ సోషల్‌ మీడియాలో అనేక వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. వీటిలో ప్రథమస్థానం డాన్స్‌లకు సంబంధించిన వీడియోలదే. అనేకమంది రకరకాల హిట్‌ పాటలకు రీల్స్‌ చేస్తూ, అద్భుతంగా డాన్స్‌ చేస్తూ తమ ప్రతిభను నెట్టింట చాటుతూ ఉంటారు. నెటిజన్లు కూడా వాటిని ఇష్టపడుతూ ఉంటారు. తాజాగా ఓ యువతి అద్భుతమైన పెర్‌ఫార్మెన్స్‌తో నెటిజన్లను కట్టిపడేస్తుంది. ఈ యువతి తరచూ ఇలాంటి వీడియోలు చేస్తుంది. అయినా ప్రతిదానిలో కొత్తదనాన్ని చూపడం ఈమె ప్రత్యేకత. ఈ యువతి స్పెషాలిటీ ఏంటంటే.. సైకిల్‌ తొక్కుతూ నృత్యం చేయడం. హ్యాండిల్‌ వదిలేసి ఎంతో ఫాస్ట్‌గా పాటకు తగ్గ స్టెప్పులతో డాన్స్‌ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

అయితే ఇప్పుడు వైరల్‌ అవుతున్న వీడియోలో బాలీవుడ్‌ మూవీ ‘దిల్ హై తుమ్హారా’లోని సూపర్‌ హిట్‌ సాంగ్‌ ‘దిల్ లగా లియా’కు లిప్ సింక్‌ ఇస్తూ.. అద్భుతంగా హావభావాలు పలికిస్తూ డాన్స్‌ చేసింది. అదికూడా వేగంగా సైకిల్‌ తొక్కుతూ. సంప్రదాయ దుస్తుల్లో ఎంతో అందంగా మూస్తాబైన ఆ యువతి తలపై పరదా మాటున ఆమె పలికించిన హావభావాలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. ఐ యామ్‌ సీక్రెట్‌ గర్ల్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేసిన ఈ వీడియో నెట్టింట దూసుకుపోతోంది.

ఇప్పటివరకూ 48 వేలమందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. యువతి ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. రోడ్డు మీద అతి వేగంతో సైకిల్ తొక్కుతూ డ్యాన్స్ చేసిన అనుభవం అందరికీ ఉండదు అంటూ కామెంట్లు చేస్తున్నారు