Valentine’s day: మాజరే మామ మజా.. సింగిల్ సింహాలు ఈ బంపర్ ఆఫర్ మీకే.. లవర్స్ ను వెతుక్కొమ్మంటున్న ఇన్‌స్టిట్యూట్
ఫిబ్రవరి నెల వస్తుందంటే ప్రేమికులకు పండగే. ఎందుకంటే.. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు ఉంటుంది కాబట్టి. ప్రతీ జంట.. ఈ రోజు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు.
ఫిబ్రవరి నెల వస్తుందంటే ప్రేమికులకు పండగే. ఎందుకంటే.. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు ఉంటుంది కాబట్టి. ప్రతీ జంట.. ఈ రోజు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అదే సమయంలో సింగిల్స్ కూడా ఈ రోజు కోసం ఎదురు చూస్తుంటారు. తమ మనసుకు నచ్చిన వారికి ప్రపోజ్ చేయడానికి ఫిబ్రవరి 14 సరైన రోజుగా భావిస్తారు. అయితే, ఫిబ్రవరి 14 ఒక్కరోజునే కాకుండా.. వారం రోజులపాటు జరుపుకుంటారు. ఇదిలాఉంటే.. లవర్స్ కోసం, ఇంకా సింగిల్స్‌గా ఉండి మింగిల్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న వారి కోసం బంపర్ ఆఫర్ ప్రకటిస్తూ ఓ స్టడీ ఇన్‌స్టిట్యూట్ విచిత్రమైన నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయ్యి తీవ్ర చర్చకు దారి తీసింది.
సాధారణంగానే ఏ స్కూల్, కాలేజీ, కోచింగ్ సెంటర్ గానీ ప్రేమ, రిలేషన్ విషయంలో విద్యార్థులను అస్సలు ప్రోత్సహించవు. చదువు పై శ్రద్ధ పెట్టాలనే సూచిస్తాయి. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇన్‌స్టిట్యూట్ మాత్రం బహువిచిత్రం అని చెప్పాలి. వాలెంటైన్స్ డే కి ముందు విద్యార్థులను ప్రేమలోకి దించే ప్రయత్నం చేస్తోంది ఈ ఇన్‌స్టిట్యూట్. ఫిబ్రవరి 14 లోపు సింగిల్స్ అంతా తమ భాగస్వామిని వెతుక్కోవాలని, కపుల్స్ అందరికీ వాలెంటైన్స్ డే రోజున బిగ్ పార్టీ ఉంటుందని ప్రకటించింది. ఈ మేరకు ఇన్‌స్టిట్యూట్ ఒక నోటీస్ జారీ చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆకాశ్ ఇన్‌స్టిట్యూట్ పేరుతో జారీ చేసిన ఈ నోటీసులో ‘ఆకాష్ మిమ్మల్ని ది బెస్ట్‌గా తీర్చిదిద్దింది. మా ప్రతిభావంతులైన అభ్యర్థుల వ్యక్తిత్వ వికాసాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. విద్యార్థులందరూ ఫిబ్రవరి 14వ తేదీలోపు మీకోసం ఒక భాగస్వామిని ఎంచుకోవడం అవసరం. ఈ ఏడాది నుంచి వాలెంటైన్స్ డే పార్టీని నిర్వహించాలని ఇన్‌స్టిట్యూల్ ప్లానింగ్ కమిటీ నిర్ణయించింది. ఇది విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపేందుకు, జీవితంలో విజయం సాధించడానికి దోహదపడుతుంది. అందుకే విద్యార్థులందరూ తమ కోసం ఒక భాగస్వామిని ఎంచుకోండి. అలాగే, కులం, మతం, రంగు, జెండర్‌తో సంబంధం లేకుండా మీ భాగస్వామిని ఎన్నుకుని పార్టీలో భాగస్వామి అవ్వండి.’ అంటూ నోటీసు జారీ చేసింది ఆకాష్ ఇన్‌స్టిట్యూట్.
అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. ఇది నిజమైనదేనా? ఫేకా? అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే.. ఈ నోటీస్ బ్యాంక్ గ్రౌండ్‌లో ఆకాష్ పేరుతో ఉంది కానీ, దానిపై ఎవరి సంతకం, ఎలాంటి స్టాంప్ గానీ లేదు. ఈ కారణంగా దీనిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలోని ఆకాష్ సంస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఈ నోటీస్ పై స్పందించింది. ఇలాంటిదేమీ తాము ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఇదే ఫేక్ అని స్పష్టం చేసింది. మరోవైపు, ఈ నోటీస్ ఇప్పడు సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. దీనిని కొందరు ఫేక్ అంటుంటే.. మరికొందరు విద్యార్థులు ఇది నిజమని, తమకు ఈ నోటీస్ అందిందని చెబుతున్నారు. ఇలా ఈ నోటీసుపై రకరకాల కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. మొత్తంగా దీనిని ఎవరో ఆకతాయిలు చేసినట్లుగా భావిస్తున్నారు.
??? pic.twitter.com/sfXBPeH94e
— v (@waybhavvvvv) January 8, 2023
మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్టింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..