Chilhood Photo: చిరునవ్వులు చిందిస్తున్న ఈ బాలుడు.. నేడు పెద్ద రాష్ట్రానికి ఫేమస్ ముఖ్యమంత్రి.. ఎవరో గుర్తు పట్టారా..

సీఎం గా ఓ పెద్ద రాష్ట్రానికి వరసగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎంపిక అయ్యి చరిత్ర సృష్టించారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి.. సన్యాసం తీసుకుని ప్రజల సమస్యలు తీర్చడం కోసం ఎంపీగా ఎంపికయ్యి.. అనంతరం ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించారు.

Chilhood Photo: చిరునవ్వులు చిందిస్తున్న ఈ బాలుడు.. నేడు పెద్ద రాష్ట్రానికి ఫేమస్ ముఖ్యమంత్రి.. ఎవరో గుర్తు పట్టారా..
Cm Yogi Childhood Photo
Follow us
Surya Kala

|

Updated on: Jan 20, 2023 | 8:36 PM

సర్వసాధారణంగా సినీ నటీనటులకు, క్రీడాకారులకు అభిమానులు ఉంటారన్న సంగతి మనకు తెలిసిందే.. అయితే తనదైన పాలనా శైలితో నిడారంబరంగా జీవిస్తూ.. ఓ ముఖ్యమంత్రి పాపులర్ అయ్యారు. అంతేకాదు ఆయనకు సెలబ్రెటీ కి తీసిపోని విధంగా ఫాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు.. సీఎం గా ఓ పెద్ద రాష్ట్రానికి వరసగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎంపిక అయ్యి చరిత్ర సృష్టించారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి.. సన్యాసం తీసుకుని ప్రజల సమస్యలు తీర్చడం కోసం ఎంపీగా ఎంపికయ్యి.. అనంతరం ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించారు. రౌడీల పాలిట సింహ స్వప్నంగా నిలుస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.. ఆయన చిన్నతనంలోని ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సిగ్గుపడిపోతూ, ముడుచుకుపోతూ, వేరెవరిదో ఇచ్చిన చొక్కా, ప్యాంట్‌తో, ముతక చెప్పులతో బీదరికమే నా నేపధ్యం అంటూ చెప్పకనే చెప్పే అతడి బాల్య చిత్రమిది. మరి ఎవరో ఆ ముఖ్యమంత్రి గుర్తు పట్టారా..

అవును ఆ బాలుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అసలు పేరు అజయ్‌సింగ్‌ బిస్త్‌.  1972 జూన్‌ 5 న ప్రస్తుత ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్‌ జిల్లా, పాంచుర్‌లో రాజ్‌పుట్‌ కుటుంబంలో జన్మించారు. ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌లో గల హెచ్‌ఎన్‌బీ గర్‌వాల్ యూనివర్సిటీ నుంచి Bscలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. గణితం, భౌతిక శాస్త్రంలో ప్రత్యేక అర్హత పొందారు.  అయినప్పటికీ ఆయన సన్యాసం పై ఆకర్షితులయ్యారు. కాషాయం ధరించారు. నేలపై నిద్ర. చలి కాలమైన ఎండా కాలమైన అన్నింటి కీ ఉన్నది ఒక్కటే వస్త్రం. తెల్లవారుజామున గోసేవ, గో పూజ నిత్య కృత్యం. గోరఖ్‌నాథ్ మఠాధిపతి ఆదిత్యానాథ్ అస్తమయంతో ఆయన వారసుడిగా మఠం బాధ్యతలు స్వీకరించారు. సన్యాస దీక్ష తీసుకున్న యోగి తండ్రి అంతిమ సందర్శన కూడా పొందలేకపోయారు. యోగి సోదరుడు భారతీయ సైన్యంలో జవాన్. సోదరి, బావగారు టీ దుకాణం నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

26 ఏళ్లకే యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. 1998లో తొలిసారిగా గోరఖ్‌పూర్‌ నుంచి ఎన్నికైనప్పుడు పార్లమెంటులో అతిపిన్న వయస్కుడుగా చరిత్ర సృష్టించారు. యూపీ సీఎం గా యోగి ఆదిత్యనాథ్ 19-3-2017 ఆదివారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదిత్యనాథ్ సహా పలువురు ఈశ్వరుడి పేరున ప్రమాణం చేశారు. రెండవ సారి 2022 మార్చి 10 న మళ్ళీ యూపీ సీఎంగా రెండవ సారి పదవిని చేపట్టి చరిత్ర సృష్టించారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం యూపీ వృద్ధి రేటు నిరంతర పెరుగుతూనే ఉంది. దేశంలోని రెండవ ఆర్ధిక రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ను అందిస్తున్నారు. నిస్వార్థం, నిగర్వి, ప్రతీ క్షణం, ప్రతీ పనీ ప్రజాహితంగా చేసే  కర్మ యోగి.. ఈ యోగి ఆదిత్యనాథ్ అంటూ అభిమానులు కీర్తిస్తుంటారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.