PM Modi Metro Ride: మెట్రో రైల్‌లో ప్రయాణించిన ప్రధాని మోడీ.. ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవిస్..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ముంబైలో కొత్త మెట్రో సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి మెట్రోలో ప్రయాణించారు.
నెటిజన్లకు ఎవరైనా ఒకటే.. CM లేదా PM అయినా.. తమకు దొరికే చాలు.. సోషల్ మీడియాలో ఫోటోలు లేదా వీడియోలు షేర్ చేసి.. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. తమకు నచ్చిన మెచ్చిన ఫోటోలను షేర్ చేస్తూ.. అందరూ ఆనందిస్తారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ , ఏక్నాథ్ షిండే , దేవేంద్ర ఫడ్నవిస్ లు ఉన్న ఓ ఫోటోని షేర్ చేస్తూ.. సందడి చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ముంబైలో కొత్త మెట్రో సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి మెట్రోలో ప్రయాణించారు. ముగ్గురూ కలిసి కూర్చున్న చిత్రాన్ని దేవేంద్ర ఫడ్నవిస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకున్నారు.. తమ ముగ్గురి మధ్య ఏమి సంభాషణ జరుగుతుందో ఊహించమని ప్రజలను కోరారు ఆయన..
ముగ్గురు గొప్ప నేతలే.. సామాన్య కార్తకర్తల నుంచి ఈరోజు ఈ స్టేజ్ కు చేరుకున్న నాయకులు మెట్రోలో ప్రయాణిస్తూ.. ఒకరితో ఒకరు నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటున్నట్లు చిత్రంలో మీరు చూడవచ్చు. చిత్రాన్నిషేర్ చేసిన దేవేంద్ర ఫడ్నవిస్ ‘సంభాషణను ఊహించండి’ అనే క్యాప్షన్‌లో రాశారు. అంతేకాదు క్యాప్షన్ తో పాటు.. నవ్వుతున్న ఎమోజీని కూడా షేర్ చేశారు.
సోషల్ మీడియా వినియోగదారులు కొరడా ఈ ఫోటోకి తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘దేశం, రాష్ట్రం భవిష్యత్తు సురక్షితంగా, ఉజ్వలంగా, ఆశలతో నిండి ఉంది!’ అని ముగ్గురు నేతలు మాట్లాడుతున్నారని ఎవరో కామెంట్ చేశారు. ప్రధాని మోడీ.. ఏక్‌నాథ్ షిండేలు మాకు లా దేవేంద్ర కు గడ్డం లేదు అని సరదగా కామెంట్ చేస్తున్నారని ఒకరు కామెంట్ చేశారు.
Guess the conversation.. ? pic.twitter.com/xaQh7RHbQE
— Devendra Fadnavis (@Dev_Fadnavis) January 19, 2023
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ముంబైలో కొత్త మెట్రో సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి మెట్రోలో ప్రయాణించారు. నివేదికల ప్రకారం, మెట్రోలో ప్రయాణం చేస్తున్న సమయంలో ప్రధాని మోడీ ప్రయాణికులతో పాటు మెట్రో ఉద్యోగులు, మహిళలతో సంభాషించారు. మెట్రో సేవలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని.. ముంబైకి మెట్రో చాలా ముఖ్యమైనదని ప్రధాని మోడీ అన్నారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఆధునీకరణ పనులు, రోడ్ల అభివృద్ధి ప్రాజెక్ట్ , బాలాసాహెబ్ థాకరే పేరుతో డిస్పెన్సరీని ప్రారంభించడం.. ఇవన్నీ ముంబై మరింత అభివృద్ధి పరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..