AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: ఆ వందేభారత్‌ రైళ్ల వేగం 200 కి.మీ.!! రెండు రూట్లలో కీలక మార్పులు..

బెర్తులు ఉండే వందేభారత్‌ రైళ్లను గంటకు 220 కి.మీ. వేగంతో వెళ్లగలిగేలా రూపొందిస్తామని, వాస్తవంగా పట్టాలపై అవి 200 కి.మీ. వేగంతో..

Vande Bharat Express: ఆ వందేభారత్‌ రైళ్ల వేగం 200 కి.మీ.!! రెండు రూట్లలో కీలక మార్పులు..
Vander Bharat Express (File Photo) Image Credit source: TV9 Telugu
Ravi Kiran
|

Updated on: Jan 20, 2023 | 1:58 PM

Share

బెర్తులు ఉండే వందేభారత్‌ రైళ్లను గంటకు 220 కి.మీ. వేగంతో వెళ్లగలిగేలా రూపొందిస్తామని, వాస్తవంగా పట్టాలపై అవి 200 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయని అధికార వర్గాలు తాజాగా వెల్లడించాయి. సీట్లు మాత్రమే అంటే ఛైర్‌కార్‌ ఉండే వందేభారత్‌లు- శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా నిలుస్తాయని వివరించాయి. బెర్తులు ఉండే రైళ్లు- రాజధాని ఎక్స్‌ప్రెస్‌లకు బదులుగా అందుబాటులోకి వస్తాయని తెలిపాయి. ఇది దశలవారీగా జరుగుతుంది.

400 వందేభారత్‌ రైళ్ల కోసం రైల్వేశాఖ టెండర్లు జారీ చేసింది. ఈ నెలాఖరు నాటికి పనులు ఖరారు కానున్నాయి. ఈ రైళ్ల ఉత్పత్తికి నాలుగు దేశీయ దిగ్గజ కంపెనీలు, పలు విదేశీ కంపెనీలు ఆసక్తితో ఉన్నాయి. మొదటి 200 రైళ్లలో సీట్లు మాత్రమే ఉంటాయి. అవి 180 కి.మీ. వేగం వరకు అందుకోగలవు. ఉక్కుతో తయారయ్యే ఈ రైళ్లను భద్రతపరమైన కారణాలతో 130 కి.మీ. వేగానికే పరిమితం చేస్తామని అధికారులు తెలిపారు. రెండోదశలో వచ్చే 200 రైళ్లను ఉక్కుకు బదులు అల్యూమినియంతో తయారు చేసి, బెర్తులు అమరుస్తారు. ఇవి 200 కి.మీ. వేగంతో వెళ్లేందుకు వీలుగా ఢిల్లీ-ముంబయి, ఢిల్లీ-కోల్‌కతా మార్గాల్లో తగిన మార్పులు చేయడంతో పాటు కంచె వేసే పనులు చేపడుతున్నామని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. రైళ్లు పరస్పరం ఢీకొనకుండా నివారించే సాంకేతిక ఏర్పాట్లను 1,800 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రెండు మార్గాల్లో చేపడుతున్నట్లు తెలిపారు.

గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్..