AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Condoms: మైనర్లకు కండోమ్స్ అమ్మొచ్చట.. కానీ.. కండీషన్స్ అప్లై!

ఆ రాష్ట్రంలో మైనర్లకు కండోమ్స్, గర్భనిరోధక మాత్రల అమ్మకాలపై నిషేధం విధించారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.

Condoms: మైనర్లకు కండోమ్స్ అమ్మొచ్చట.. కానీ.. కండీషన్స్ అప్లై!
Condoms Sale
Ravi Kiran
|

Updated on: Jan 20, 2023 | 1:50 PM

Share

ఆ రాష్ట్రంలో మైనర్లకు కండోమ్స్, గర్భనిరోధక మాత్రల అమ్మకాలపై నిషేధం విధించారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం దానిపై తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఎలాంటి నిషేధం విధించలేదంటూ.. కానీ.. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

మైనర్లకు కండోమ్స్, గర్భనిరోధక మాత్రల అమ్మకాలపై ఎలాంటి నిషేధం విధించలేదని.. వాళ్లు కొనుగోలు చేయకుండా నిరోధించేందుకు ఫార్మసిస్ట్‌లను కౌన్సిలింగ్ ఇవ్వమని కోరామని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. 18 ఏళ్లలోపు వారికి కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రాలు విక్రయించకుండా నిషేధిస్తూ ఫార్మాసిస్ట్‌లకు ఎలాంటి సర్క్యులర్‌ను జారీ చేయలేదని కర్ణాటక డ్రగ్స్ కంట్రోల్ విభాగం క్లారిటీ ఇవ్వడమే కాదు.. దీనిపై వస్తోన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని వెల్లడించింది.

ఇటీవల బెంగళూరులోని పలువురు స్కూల్ స్టూడెంట్స్ బ్యాగులలో కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు కనిపించిన సంఘటనలు రాష్ట్రంలో వెలుగు చూడటంతో.. రాష్ట్ర ప్రభుత్వం మైనర్లకు కండోమ్స్ అమ్మకాలపై నిషేధం విధించినట్లుగా పలు మీడియా వర్గాల్లో వార్తలు గుప్పుమన్నాయి. ‘ఎక్కడా కూడా కండోమ్స్, గర్భనిరోధక మాత్రాలపై ఎలాంటి నిషేధం విధించలేదు. లైంగికంగా సంక్రమించే వ్యాధులను నివారించేందుకు, జనాభా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం వీటిని ప్రోత్సహిస్తోంది. అయితే స్కూల్ పిల్లలకు మాత్రం కాదు. 18 ఏళ్లలోపు ఉన్న యువకులకు ఈ మందులు విక్రయించకూడదు అని సర్కులర్‌లో స్పష్టంగా వివరించాం. వారు వీటిని కొనుగోలు చేయకుండా.. ఫార్మసీలు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించాం’ అని కర్ణాటక డ్రగ్స్ కంట్రోలర్ భాగోజీ టి ఖానాపూరే అన్నారు.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్