Indian Economy: రాబోయే 20 సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్.. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో ఆర్థిక నిపుణులు..

రాబోయే 10, 20 సంవత్సరాలలో భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా వేగంగా అభివృద్ధి చెందుతుందని చీఫ్ ఎకనామిక్స్ కామెంటేటర్ మార్టిన్ వోల్ఫ్ వ్యాఖ్యానించారు.

Indian Economy: రాబోయే 20 సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్.. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో ఆర్థిక నిపుణులు..
Martin Wolf
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 20, 2023 | 1:13 PM

రాబోయే 10, 20 సంవత్సరాలలో భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా వేగంగా అభివృద్ధి చెందుతుందని చీఫ్ ఎకనామిక్స్ కామెంటేటర్ మార్టిన్ వోల్ఫ్ వ్యాఖ్యానించారు. దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా మాట్లాడిన మార్టిన్ వోల్ఫ్.. భారతదేశ ఆర్థిక వృద్ధి అవకాశాలపై విశ్వాసం వ్యక్తం చేశారు. ‘చాలా కాలంగా భారతదేశ ఆర్థిక గమనాన్ని పరిశీలిస్తున్నాను. ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇది నిజంగా అద్భుతమైన అంశం. రాబోయే 10-20 సంవత్సరాలలో ఖచ్చితంగా ఆర్థికంగా అగ్రదేశాల లిస్ట్‌లో చేరుతుంది. వ్యాపారం, ఇతర రంగాల బిజినెస్‌లో లేని వారు భారతదేశం ఆర్థిక వృద్ధిని అంచనా వేయలేరు. ప్రపంచంలో భారత్ స్థానం ఏంటో వారు అర్థం చేసుకోలేరు. చూస్తూ ఉండండి. భారత్ అనతి కాలంలో ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది.’ అని మార్టిన్ వోల్ఫ్ తెలిపారు.

ఇక ప్రపంచ బ్యాంకు సీనియర్ ఆర్థికవేత్త ధృవ్ శర్మ ప్రకారం.. డిసెంబరులో ప్రపంచ బ్యాంక్ భారతదేశ 2022-23 జీడీపీ వృద్ధి రేటు అంచనాను 6.5 శాతం నుండి 6.9 శాతానికి సవరించింది. ఇక FY21-22లో భారత వృద్ధిరేటు 8.7 శాతానికి అంచనా వేశారు. ‘భారతదేశం 10 సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు మరింత స్థితిస్థాపకంగా ఉంది. గత 10 సంవత్సరాలుగా తీసుకున్న అన్ని చర్యలు భారతదేశం ప్రపంచానికి దిక్సూచిగా మారడంలో సహాయపడుతుంది.’ అని ప్రపంచ బ్యాంక్ సీనియర్ ఆర్థికవేత్త ధృవ్ శర్మ అన్నారు. కరోనా సంక్షోభం తరువాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పుంజుకుంటోందన్నారు శర్మ.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!