Dog Viral Video: రైల్వే ట్రాక్‌ దాటుతున్న శునకం.. దూసుకొచ్చిన గూడ్స్‌ రైలు.. కుక్క తెలివిగా ఏమి చేసిందంటే..

ఈ వీడియోలో ఓ కుక్క రైల్వే ట్రాక్‌ దాటుతోంది. అదే సమయంలో ఆ ట్రాక్‌ పైనుంచి గూడ్స్‌ రైలు ఒకటి దూసుకొచ్చింది. సీన్‌ చూస్తే కుక్క ఆయుష్షు ముగిసినట్టే అనిపిస్తుంది. కానీ ఇక్కడే ఆ కుక్క తన తెలివిని ప్రదర్శించింది.

Dog Viral Video: రైల్వే ట్రాక్‌ దాటుతున్న శునకం.. దూసుకొచ్చిన గూడ్స్‌ రైలు.. కుక్క తెలివిగా ఏమి చేసిందంటే..
Dog Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jan 20, 2023 | 5:27 PM

విశ్వాసానికి మారు పేరు శునకం. అందుకే చాలామంది కుక్కలను పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. కుక్కలు చాలా చురుగ్గా..తెలిగా ఉంటాయి. యజమానులు చెప్పే ప్రతి విషయాన్ని ఎంతో చక్కగా ఆకళింపు చేసుకొని వాటిని అనుసరిస్తాయి. అంతేకాదు యజమాని కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడతాయి. ఈ క్రమంలో తమని తాము కూడా రక్షించుకోవాలి కదా.. అందుకు అవి చాలా తెలివిగా వ్యవహరిస్తుంటాయి. అందుకు ఉదాహరణే ఈ వీడియో. అయితే ఈ వీడియో చూస్తే మాత్రం మీ గుండె ఆగినంత పనౌతుంది.

ఈ వీడియోలో ఓ కుక్క రైల్వే ట్రాక్‌ దాటుతోంది. అదే సమయంలో ఆ ట్రాక్‌ పైనుంచి గూడ్స్‌ రైలు ఒకటి దూసుకొచ్చింది. సీన్‌ చూస్తే కుక్క ఆయుష్షు ముగిసినట్టే అనిపిస్తుంది. కానీ ఇక్కడే ఆ కుక్క తన తెలివిని ప్రదర్శించింది, రైల్వే ట్రాక్‌ మధ్యలో నక్కి పడుకుంది. అంతే పట్టాలుమీదుగా రైలు వెళ్లిపోయింది… కుక్క సేఫ్‌గా లేచి తన దారిన వెళ్లిపోయింది.

ఇవి కూడా చదవండి

మనుషులకే కాదు మాకూ తెలివితేటున్నాయ్‌ అని నిరూపించింది ఈ శునకం. ఈ ఘటన ఎక్కడ జరిగింతో క్లారిటీ లేదు .. కానీ వీడియో మాత్రం నెట్టింట ఓ రేంజ్లో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు కుక్క తెలివికి ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..